JP Nadda: హిందువుల‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్య‌లు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన జేపీ నడ్డా..

సోమవారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. భారతదేశంలో హింస, ద్వేషం, భయం వ్యాప్తి చెందుతోందని.. ఇక్కడ హిందువులమని చెప్పుకునేవారు హింసను ప్రోత్సహిస్తున్నారంటూ రాహుల్ గాంధీ ప్రధాని మోదీతో సహా బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

JP Nadda: హిందువుల‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్య‌లు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన జేపీ నడ్డా..
Jp Nadda
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 01, 2024 | 11:26 PM

సోమవారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారి తీశాయి. భారతదేశంలో హింస, ద్వేషం, భయం వ్యాప్తి చెందుతోందని ఆయన అన్నారు. హిందువులు హింసకు పాల్పడరు. ఇక్కడ హిందువులమని చెప్పుకునేవారు హింసను ప్రోత్సహిస్తున్నారంటూ రాహుల్ గాంధీ ప్రధాని మోదీతో సహా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. దీనిపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ హిందూ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని మండిపడ్డారు. ఈ అంశంపై ఆయన వరుసగా ట్వీట్లతో కాంగ్రెస్ నేతపై ధ్వజమెత్తారు

పార్లమెంట్‌లో తొలి రోజే ప్రతిపక్ష నేత బ్యాడ్ పెర్ఫార్మన్స్ చూపారని సెటైర్ వేశారు జేపీ నడ్డా. అబద్దాలు, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ.. ప్రజలకు ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. 5 సార్లు ఎంపీ అయినప్పటికీ.. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఇంకా పార్లమెంట్ నియమాలు నేర్చుకోలేదని.. తన పంధాను ఏమాత్రం మార్చుకోలేదన్నారు.

హిందువులను హింసావాదులగా.. విదేశీ దౌత్యవేత్తలకు హిందువులను ఉగ్రవాదులుగా అభివర్ణించిన రాహుల్ గాంధీ.. వెంటనే హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలన్నారు జేపీ నడ్డా. గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రతిపక్షాన్ని ప్రజలు వరుసగా 3 సార్లు తిరస్కరించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఈ విషయంలో తనదైన రికార్డు సృష్టిస్తుందని జేపీ నడ్డా కౌంటరిచ్చారు.