Viral video: ‘స్పీకర్‌జీ కళ్లలోకి సూటిగా చూడరేం..? మీ కళ్లజోడు ధరించి ఇటు చూడండి’ పార్లమెంటులో మహిళా ఎంపీ చతురోక్తులు! వీడియో
పాకిస్థాన్ పార్లమెంటు సమావేశాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా ఎంపీ, పార్లమెంట్ స్పీకర్‌కి మధ్య జరిగిన పరస్పర సంభాషణ ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తుంది. తాజాగా సమావేశం జరుగుతున్న సమయంలో పాక్ మాజీ మంత్రి జర్తాజ్ గుల్ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు..
ఇస్లామాబాద్, జులై 1: పాకిస్థాన్ పార్లమెంటు సమావేశాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా ఎంపీ, పార్లమెంట్ స్పీకర్‌కి మధ్య జరిగిన పరస్పర సంభాషణ ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తుంది. తాజాగా సమావేశం జరుగుతున్న సమయంలో పాక్ మాజీ మంత్రి జర్తాజ్ గుల్ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అయితే ఆమె మాట్లాడుతున్నా స్పీకర్ సాధిక్ ఆమె వైపు చూడకపోవడంతో జర్తాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
*నా పార్టీ నేతలు నాకు ఇతరుల కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం నేర్పించారు. నేను ఒక నాయకురాలిని. 1.5 లక్షల ఓట్లతో ఈ సభలో అడుగుపెట్టాను. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఇలా నావైపు చూడకుండా, నా మాట వినకుంటే నేను మాట్లాడలేను. దయచేసి మీరు కళ్లజోడు ధరించి నాపైపు చూడండి’ అంటూ ఆమె స్పీకర్‌ను కోరారు. ఇందుకు స్పీకర్ చమత్కారంగా బదులిచ్చారు. ‘నేను మీ మాటలు వింటాను. కానీ మహిళల కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాలేను. అందుకే మిమ్మల్ని సూటిగా చూడట్లేదని* ఆయన అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. *మహిళలను మీరు ఇలా విస్మరిస్తే, 52% మంది ఎంపీలు మాత్రమే ఇక్కడికి వస్తారంటూ* జర్తాజ్ గుల్ కౌంటర్ వేశారు. వీరి సంభాషన పాక్ పార్లమెంట్‌లో నవ్వులు పూయించింది. వీరి సంభాషణకు సంబంధించిన వీడియోను పాక్ మీడియా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.
Meanwhile..Parliament in Pakistan pic.twitter.com/U5GcDD4Dp1
— We Dravidians (@WeDravidians) June 30, 2024
ఎవరీ జర్తాజ్ గుల్?
జర్తాజ్ గుల్ ఒక పాకిస్తాన్ నేత. మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రిగా 2018 నుండి 10 ఏప్రిల్, 2022 వరకు ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడే వరకు ఆమె పనిచేశారు. 2018 నుంచి 2023 వరకు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా కొనసాగారు. 2024లో జర్తాజ్ గుల్ డేరా ఘాజీ నుంచి తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.