Brahmamudi, December 28th Episode: లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
కావ్య పెట్టిన రూల్స్ వల్ల ఇబ్బంది పడుతున్నామని.. సుభాష్‌కి ప్రకాశం చెబుతూ ఉంటాడు. అప్పుడే ఆస్పత్రి బిల్ కట్ట లేదని సుభాష్‌కి ఫోన్ వస్తుంది. దీంతో కావ్యని పిలిచి అడిగితే.. సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటుంది. అప్పుడే రాజ్ వచ్చి.. ఆడిటింగ్ అని అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. కానీ ఇందిరా దేవి, సుభాష్‌కి, రుద్రాణికి అనుమానం వస్తుంది..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య గురించి ప్రకాశాన్ని అడగమని పంపిస్తుంది ధాన్యలక్ష్మి. ఇక భయ పడుతూ వచ్చిన ప్రకాశం అన్నయ్యగా నీతో కొంచెం మాట్లాడాలి అని అడుగుతాడు. సరే ఏంటో చెప్పురా అని సుభాష్ అంటాడు. కావ్య గురించి.. తను పెట్టని రూల్స్ వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు అన్నయ్యా అని ప్రకాశం అంటే.. అందరూ అంటే ఎవర్రా నీ భార్య, ఆ మంధర అంతే కదా అని సుభాష్ అంటాడు. అంటే ధాన్యం, రుద్రాణి బయట పడుతున్నారు కానీ.. మిగతా వాళ్లు బయట పడటం లేదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేస్తే మంచిది కదా అని, ఒకమాట నువ్వు చెప్తే బాగుంటుందని ప్రకాశం అంటాడు. సరే చెప్తానని సుభాష్ అనేలోపు.. ఫోన్ వస్తుంది. అది విని షాక్‌కి గురవుతాడు సుభాష్. కావ్యని పిలిచి, ఆస్పత్రి బిల్ ఇంకా క్లియర్ కాలేదంట ఎందుకమ్మా అని అడుగుతాడు. అది అని ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది కావ్య.
ట్రీట్మెంట్‌కి కూడా బిల్ కట్టలేదా?
ఇదే అదునుగా రుద్రాణి, ధాన్యలక్ష్మిలు రెచ్చిపోతారు. లోక కళ్యాణం కోసం, దుగ్గిరాల వంశ ప్రతిష్టను మరింత ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టడం కోసం అంతేనా కావ్యా? అయినా ఐదు లక్షలు కూడా క్లియర్ కాలేదంటే ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు ఆస్పత్రి బిల్ ఆపాల్సి వచ్చింది? అని రుద్రాణి, అయినా ఆస్పత్రి బిల్ ఆపే అధికారం ఈవిడకు ఎక్కడిది? మా మావయ్య గారి బిల్ కూడా ఆపే హక్కు నీకు ఎక్కడిది? ఇంట్లో ఇంత ఇబ్బంది పెడుతూ.. చేతి ఖర్చులకు అడిగినా సున్నా.. ఇన్నింటికీ నువ్వు ఆంక్షలు పెట్టినా, కానీ ఆస్పత్రి బిల్ ఎందుకు కట్టలేదు అంటూ ధాన్యలక్ష్మి నిలదీస్తే కావ్య సమాధానం చెప్పకుండా కంగారు పడుతుంది. అప్పుడే రాజ్ పై నుంచి నేను చెబుతాను అంటూ కిందకు దిగుతాడు. ఆస్పత్రి బిల్ కూడా క్లియర్ చేయకుండా నీ పెళ్లం డబ్బు అంతా ఏం చేస్తుందని రుద్రాణి అడిగితే.. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని అంటాడు. అంటే నీ ప్రమేయం ఉందనే కదా మరి ఆస్పత్రి బిల్ ఎందుకు క్లియర్ చేయలేదని అపర్ణ అడుగుతుంది. ఏంట్రా ఏం జరుగుతుంది? ఆయన ట్రీట్మెంట్‌కు ఆగే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఇందిరా దేవి అడుగుతుంది.
ఇప్పుడు ఆడిటింగ్ ఏంటి..
అసలు జరిగింది ఏమిటో మీకు తెలిస్తే అంటూ కావ్య నిజం చెప్పాలి అనుకుంటే కావ్య ఆపేస్తుంది. జరిగినదానికి నేనే బాధ్యుడిని నేనే చెబుతాను అని రాజ్ అంటే.. కాదు ఏదో పెద్ద విషయమే దాస్తున్నారు. నిజం ఏంటో చెప్పమని అపర్ణ అడిగితే.. ఆఫీస్‌లో ఆడిటింగ్ జరుగుతుంది. అందుకే ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయని రాజ్ అంటే.. ఇప్పుడు ఆడిటింగ్ ఏంట్రా? అది మార్చిలో జరుగుతుంది కదా అని ప్రకాశం అంటే.. శభాష్ చిన్న అన్నయ్యా కరెక్ట్‌గా అడిగావు. ఇప్పుడు ఆడిటింగ్ జరగడం ఏంటి? అని రుద్రాణి అడిగితే.. దానికి నీ కొడుకే కారణం అత్తా అని రాజ్ అంటాడు. నా కొడుకు ఏం చేశాడని రుద్రాణి అడుగుతుంది.
అంతా రాహుల్ వల్లే..
మధ్యలో వెళ్లి సిఈవో సీట్లో కూర్చున్నాడు కదా.. అంతా అస్తవ్యస్తం చేసి పడేశాడు. అకౌంట్స్ అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత కళావతి సీట్‌లో కూర్చొంది. తను కొంత క్లారిటీ తీసుకొచ్చింది. కానీ ఇదంతా రాహుల్ వల్ల జరిగినా తను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు అంతా అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకు చుట్టుకుంది. ఆడిటింగ్ మొదలు కాగానే అకౌంట్స్ అన్నీ హోల్డ్ చేసి, ట్రాన్సాక్షన్స్ ఆపేసి లెక్కలు అన్నీ క్లియర్ చేయాలి అనుకున్నా. కానీ నా లెక్క తప్పింది. తాతయ్య ట్రీట్మెంట్ కోసం ఇచ్చిన చెక్ క్లియర్ అయ్యింది అనుకున్నాం కానీ అది కూడా హోల్డ్‌లో పెట్టారని తెలిసింది. ఇందుకు నేనే బాధ్యుడిని అని రాజ్ అంటాడు. బాగానే ఉందిరా.. నీ పెళ్లాం మీద ప్రేమ సడెన్‌గా ఎందుకు వచ్చింది? తాతయ్య ట్రీట్మెంట్ కంటే నీకు నీ భార్యను వెనకేసుకు రావడమే ఎక్కువైపోయిందని రుద్రాణి అంటుంది. నాకు ఎవరైనా ఒక్కటే. రేపు తాతయ్య బిల్ కట్టేస్తాను చాలా అని రాజ్ అనేసి వెళ్తాడు. ఇక అక్కడి నుంచి ఇందిరా దేవి కోపంగా లేచి వెళ్లిపోతుంది.
ఏదన్నా సమస్య వచ్చిందా..
బయట కూర్చున్న ఇందిరా దేవి దగ్గరకు వచ్చి.. అమ్మమ్మ గారూ మీతో మాట్లాడొచ్చా అని కావ్య అడుగుతుంది. సొంత వాళ్లతో మాట్లాడానికి కూడా ఎప్పటి నుంచి పర్మిషన్ తీసుకుంటున్నావు? అని ఇందిరా దేవి అంటుంది. తాతయ్య గారి ట్రీట్మెంట్ బిల్ కట్టలేదని మీకు కోపం వచ్చిందా? తాతయ్య గారికి అన్యాయం చేస్తున్నామని సందేహం వచ్చిందా? నా మీద అలిగారా.. ఏదో ఒకటి మాట్లాడండి. నేను, ఆయన వెళ్లి ఇప్పుడే బిల్ కట్టేస్తాం. అర్థం చేసుకోమని కావ్య అంటే.. అర్థం చేసుకున్నారు కాబట్టే.. తన మనవడిని కూడా కాదని ఇంత పెద్ద బాధ్యతను నీ మీద పెట్టారు మీ తాతయ్య. ఇన్ని కోట్ల వ్యాపారం చేసే మనం కేవలం ఐదు లక్షల బిల్ కట్టలేదు ఏంటి? అని ఇందిరా దేవి అంటే.. అదే అమ్మమ్మ గారు అకౌంట్స్, ఆడిటింగ్ అని కావ్య అంటే.. లేదు ఆ సందర్భాన్ని బట్టి మీరు సర్ది చెప్పినట్టు మాకు అనిపించింది. కావ్య చెబుతున్నా.. ఇందిరా దేవి నమ్మదు.. ఏది నిజమో ఏది అబద్ధమో మీకే తెలుసు. ఆఫీసు అన్నాక చాలా ఇబ్బందులు ఉంటాయి. దాని వల్ల మీరు ఇబ్బంది పడుతూ.. మాతో చెప్పుకోలేక పోతున్నారేమో అనిపిస్తుందని ఇందిరా దేవి అంటే.. అలాంటిది ఏమీ లేదని కావ్య అంటుంది.
సుభాష్‌కి, రుద్రాణికి వచ్చిన అనుమానం..
ఆ తర్వాత రాజ్ టెన్షన్ పడుతూ ఉండగా.. సుభాష్ వస్తాడు. రేయ్ రాజ్ ఏం జరిగిందిరా? మరి ఎందుకు అలా ఉన్నావని అడుగుతాడు. అబ్బే ఏమీ లేదని రాజ్ అంటే.. నా కొడుకు గురించి నాకు తెలీదా? నాకు నీ కంటే ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఏదన్నా ఇబ్బంది ఉంటే చెప్పు. నువ్వు కింద చెప్పింది అబద్ధం అని నాకు తెలుసు అని సుభాష్ అడుగుతాడు. కానీ రాజ్ చెప్పడు. ఏమీ లేదు డాడ్ అంతా నేను చూసుకుంటానని అంటాడు. నిజంగా నీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే చెప్పమని సుభాష్ అడిగితే.. నిజంగానే ఏమీ లేదని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత రుద్రాణి కూడా రాజ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ.. ఏదో దాస్తున్నాడు అంటూ అనుమాన పడుతుంది. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..