Jabardasth Varsha: ఇమ్మాన్యుయేల్‌తో మాటల్లేవ్! ఇన్‌స్టాలోనూ బ్లాక్ చేశానంటోన్న జబర్దస్త్ వర్ష.. ఏమైందంటే?
జబర్దస్త్ కామెడీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇమ్మాన్యుయేల్- వర్ష జోడీ కూడా ఒకటి. సుడిగాలి సుధీర్- రష్మీ గౌతమ్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారీ జంట. ఆన్ స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీ చూసి ఇమ్మాన్యుయేల్- వర్ష నిజంగానే ప్రేమలో ఉన్నట్లు చాలా మంది భావించారు.
జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిన వారిలో వర్ష-ఇమ్మానుయేల్ జోడీ ఒకటి. చాలామంది వీరి లవ్ ట్రాక్ కోసమే జబర్దస్త్ ను చూశారంటే అతిశయోక్తి కాదు. అందుకు తగ్గట్గుగానే ఈ జంటకు రెండు , మూడు సార్లు స్టేజ్ మీదే పెళ్లి చేయించారు. ఆన్ స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీని చూసి వీరు నిజ జీవితంలో కూడా లవ్ లో ఉన్నట్లు భావించారు చాలామంది ఆడియెన్స్. అయితే, తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే నని, అంతకు మించి ఏమీ లేదని ఇమ్మాన్యుయేల్, వర్ష పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వీరి స్నేహ బంధం కూడా బీటలు వారిందని తెలుస్తోంది. తాజాగా ఇమ్మానుయేల్ గురించి వర్ష చేసిన కామెంట్లు ఇందుకు బలాన్నిస్తాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. తాజాగా ఓ టీ వీ షోకు జంటగా హాజరయ్యారు వర్ష, ఇమ్మాన్యుయేల్. ఈ సందర్భంగా 2024 సంవత్సరం ఎలా గడిచిందో అందరూ చెప్పుకొచ్చారు. చాలామంది ఈ ఏడాది తమకు అద్భుతంగా గడిచిందని చెప్పుకొచ్చారు. అయితే వర్ష మాత్రం 2024 లాంటి ఏడాది ఇంకోటి అసలు వద్దు అంటూ ఎమోషనల్ అయ్యింది.
అసలు ఏం జరిగిందంటే?
‘ నా జీవితంలో 2024 లాంటి సంవత్సవరం మళ్లీ ఎప్పటికి చూడకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇష్టమైన వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చిందంటే కొంచం కూడా తట్టుకోలేం. ఈ ఏడాది నాకు ఇమ్మానుయేల్‌కి ఒకసారి కాదు.. లెక్క లేనన్ని సార్లు గొడవలు జరిగాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నాం’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వర్ష. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎంతో అన్యన్యంగా కనిపించే ఇమ్మాన్యుయేల్- వర్ష ఎందుకు విడిపోయారు? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
క్రిస్మస్ వేడుకల్లో జబర్దస్త్ వర్ష..
View this post on Instagram
కాగా ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు. కమెడియన్ గా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. మరోవైపు వర్ష కూడా టీవీషోస్ తో ఫుల్ బిజి బిజీగా ఉంటోంది.
జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.