Ram Charan: బాలయ్య టాక్‌షోలో రామ్ చరణ్ ధరించిన హుడీ ధరెంతో తెలుసా? అన్ని లక్షలా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ అందుకున్నాయి.
ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ త్వరలోనే గేమ్ ఛేంజర్ గా మన ముందుకు రానున్నాడు. శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రాజకీయ నాయకుడిగానూ, ఐఏఎస్ అధికారికానూ కనిపించనున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే శ్రీకాంత్, అంజలి, ఎస్ జే సూర్య, సునీల్ ఇలా స్టార్ నటులు గేమ్ ఛేంజర్ సినిమాలో సందడి చేయనున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మూవీ యూనిట్ ఆల్రెడీ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.ఇందులో భాగంగా గురువారం (జనవరి 02) సాయంత్రం గేమ్ ఛేంజర్ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక ప్రమోషన్స్ లో భాగంగానే ఆహా అన్ స్టాపబుల్ షోకు హాజరయ్యాడు రామ్ చరణ్. నందమూరి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ టాక్ షోకు చరణ్ తో పాటు అతని బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్, నిర్మాత విక్రమ్ రెడ్డి ఈ షోలో సందడి చేశారు. మంగళవారం ఈ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. ఈ ఎపిసోడ్ షూట్ ఫొటోలు బయటకు రాగా నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య షో కోసం రామ్ చరణ్ వేసుకొచ్చిన హుడీ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అయినా ఎంతో స్టైలిష్ గా ఉంటాడు రామ్ చరణ్. అలా అన్ స్టాపబుల్ షోకు కూడా స్టైలిష్ గా ముస్తాబై వచ్చాడు గ్లోబల్ స్టార్. బ్లాక్ కలర్ తో చేతుల మీద వైట్, రెడ్ కలర్స్ డిజైన్ తో ఉన్న హుడీ తో బాలయ్య షోలో సందడి చేశాడు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో అభిమానులు ఈ హుడీ గురించి నెట్టింట తెగ వెతికారు. ఈ క్రమంలోనే చరణ్ ధరించిన అమిరి బ్రాండ్ హుడీ ధర అసలు ధర ఒక లక్ష 10 వేలకు పైగానే ఉందని తెలుస్తోంది. అయితే డిస్కౌంట్ లో ఆన్ లైన్ లో 88 వేలకు వస్తుంది. దీంతో ఈ ధర చూసి అభిమానులు నోరెళ్ల బెడుతున్నారు.
కాగా ఈసారి సంక్రాంతి బరిలో బాలయ్య, రామ్ చరణ్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ గా గ్లోబల్ స్టార్, డాకూ మహారాజ్ గా బాలయ్య థియేటర్లలో సందడి చేయనున్నారు.
బాలయ్య అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్..
The Global star Ramcharan is here!
Get ready for the biggest and most explosive episode ever! 🌟🔥@AlwaysRamCharan @ImSharwanand#UnstoppableWithNBKS4 #aha #Ramcharan #Balakrishna #Gamechanger pic.twitter.com/Bgd5ivdoJr
— ahavideoin (@ahavideoIN) December 31, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి