Game Changer: పక్కకు తప్పుకున్న తమిళ తంబీలు.. అక్కడా గేమ్ ఛేంజర్‌కు గ్రౌండ్ క్లియర్..!

Game Changer Movie: ఇప్పుడు అందరి చూపు అటువైపే ఉంది.. అదే చరణ్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు స్టేట్స్‌లో గేమ్‌ చేంజర్‌కు పెద్దగా పోటి కనిపించకపోయినా... తమిళనాట మాత్రం నిన్న మొన్నటి వరకు గట్టి పోటి తప్పదన్న టాక్ వినిపిస్తోంది. నెమ్మది గా అక్కడ కూడా గేమ్ చేంజర్‌కి గ్రౌండ్ క్లియర్ అవుతోంది.

Game Changer: పక్కకు తప్పుకున్న తమిళ తంబీలు.. అక్కడా గేమ్ ఛేంజర్‌కు గ్రౌండ్ క్లియర్..!
Ram Charan's Game Changer
Follow us
Satish Reddy Jadda

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 01, 2025 | 8:37 PM

కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌ కం చెప్పేందుకు రెడీ అవుతోంది గేమ్ చేంజర్‌ మూవీ(Game Changer Movie). మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్‌లో ఉన్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన యూనిట్ అన్ని రాష్ట్రాల మీద స్పెషల్ కేర్ తీసుకుంటోంది. ముఖ్యంగా రాం చరణ్ హోం స్టేట్స్ ఆంధ్రా, తెలంగాణతో పాటు దర్శకుడు శంకర్‌ సొంత రాష్ట్రమైన తమిళనాడులోనూ భారీ ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తోంది. అయితే తెలుగు స్టేట్స్‌లో గేమ్‌ చేంజర్‌కు పెద్దగా పోటి కనిపించకపోయినా… తమిళనాట మాత్రం నిన్న మొన్నటి వరకు గట్టి పోటి తప్పదన్న టాక్ వినిపిస్తోంది. నెమ్మది గా అక్కడ కూడా గేమ్ చేంజర్‌కి గ్రౌండ్ క్లియర్ అవుతోంది.

విక్రమ్ – వీర ధీర సూరన్‌, బాలా – వనంగాన్‌, అజిత్ – విడాముయర్చి సినిమాలు జనవరి 10న రిలీజ్ కు ప్లాన్ చేసుకున్నాయి. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్‌లో ఈ సినిమాలన్నీ ఆడియన్స్ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవటంతో వీర ధీర సూరన్‌ను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో మేజర్ మూవీ కాంపిటీషన్ తప్పుకున్నట్టైంది. బాలా వనంగాన్ రిలీజ్ విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి. రిలీజ్ వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించకపోయినా… ఇంత వరకు ప్రమోషన్ స్పీడు పెంచకపోవటంతో ఈ సినిమా రిలీజ్‌ కూడా లేనట్టేనా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. ఒక వేళ ఈ సినిమా రిలీజ్ అయినా రామ్ చరణ్‌ క్రేజ్‌, శంకర్‌ ఇమేజ్‌ ముందు పెద్ద పోటీ కాదంటున్నారు క్రిటిక్స్‌.

ఇక ఫైనల్‌గా తప్పకుండా రిలీజ్ అవుతుందన్న అంచనాలు ఉన్న విడాముయర్చి కూడా వాయిదాపడింది. అజిత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఈ మూవీ రిలీజ్ కూడా వాయిదాపడటంతో గేమ్ ఛేంజర్‌కు ఇక తమిళనాట పెద్దగా ఇంబ్బంది ఉండదన్న టాక్ వినిపిస్తోంది. ఓవరాల్‌గా భారీ గేమ్ చేంజర్‌కు తమిళనాట భారీ పోటి తప్పదనుకుంటున్న టైమ్‌లో తమిళ తంబీలు సైడ్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్‌ మూవీలో రామ్ చరణ్‌ రెండు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. లాంగ్ గ్యాప్ తరువాత చరణ్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా కావటంతో గేమ్ చేంజర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలు అందుకుంటుందో లేదో చూడాలి.