Chiranjeevi: మెగా మూవీ విషయంలో ఫుల్ క్లారిటీ.. చిరు రోల్‌పై హింట్ ఇచ్చిన శ్రీకాంత్
దసరా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవితో మూవీ ఛాన్స్ కొట్టేశారు. రెండో సినిమా పట్టాలెక్కక ముందే చిరంజీవితో మూడో ప్రాజెక్ట్ కి సైన్ చేశారు. దసరా సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు శ్రీకాంత్. శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ కూడా నాని హీరోగానే రూపొందుతోంది.
దసరా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ ఓదెల మెగా ఛాన్స్ కొట్టేశారు. రెండో సినిమా పట్టాలెక్కక ముందే మూడో ప్రాజెక్ట్ కి సైన్ చేశారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా. దసరా సినిమాతో నాని మాస్ లుక్ లో చూపించి పాన్ ఇండియా హిట్ అందుకున్నారు శ్రీకాంత్. ఈ యంగ్ డైరెక్టర్ వర్కింగ్ స్టైల్ కు ఫిదా అయిన నాని, రెండో ఛాన్స్ కూడా ఇచ్చారు. శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ కూడా నాని హీరోగానే రూపొందుతోంది.
నాని, శ్రీకాంత్ కాంబోలో రూపొందుతున్న సెకండ్ మూవీకి ప్యారడైజ్ అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రీకాంత్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వయలెంట్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాను నాని నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్ కు సంబంధించిన అప్‌డేట్ రావటమే ఆలస్యం కథా కథనాలు ఎలా ఉండబోతున్నాయి, చిరు లుక్, క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్న చర్చ మొదలైంది.
శ్రీకాంత్ తో మోస్ట్ వయలెంట్ మూవీ అని చెప్పటంతో ఈ సినిమాలో చిరు యంగ్ లుక్ లో కనిపిస్తారని, వింటేజ్ మెగాస్టార్ ను గుర్తు చేసేలా చిరు లుక్స్, క్యారెక్టర్ ఉంటాయన్న ప్రచారం గట్టిగా జరిగింది. అయితే వార్తలపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. మెగా మూవీ కథ గురించి రివీల్ చేయకపోయినా,… ఈ సినిమాలో చిరు వింటేజ్ లుక్స్ లో కనిపిస్తారన్న వార్తలను మాత్రం కొట్టిపారేశారు. మెగాస్టార్ కోసం తాను డిఫరెంట్ స్టోరిని సిద్ధం చేస్తున్నట్టుగా వెల్లడించారు.
శ్రీకాంత్ ఓదెల మూవీలో చిరు తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రజెంట్ టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వారు తన వయసు తగ్గ పాత్రల్లో నటిస్తూనే బిగ్ హిట్ అందుకుంటున్నారు. అందుకే చిరు కూడా అలాంటి కథతోనే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. కాస్త ఏజ్డ్ లుక్ లో కనిపిస్తూనే యాక్షన్ సీన్స్ లో కనిస్తారన్న హింట్ ఇచ్చారు దర్శకుడు శ్రీకాంత్. ప్రజెంట్ విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు ఆ సినిమా పూర్తయిన తరువాత శ్రీకాంత్ సినిమా కోసం రెడీ అవుతారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర ఫాంటసీ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోసారి చిరు జగదేక వీరుడు అతిలోక సుందరి తరహా కథలో నటిస్తుండటంతో విశ్వంభర మీద భారీ అంచనాలు ఉన్నాయి.