Sukumar: సినిమాల్లోకి సుకుమార్ కూతురు.. మూవీ రిలీజ్ కాకముందే అవార్డు.. ఫొటోస్ చూశారా?

పుష్ప 2 సినిమాతో మరోసారి నేషనల్ వైడ్ పాపులర్ అయ్యారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమా ఏకంగా రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేసింది. ఇప్పుడు సుకుమార్ కూతురు కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడిచేందుకు రెడీ అయిపోయింది.

Sukumar: సినిమాల్లోకి సుకుమార్ కూతురు.. మూవీ రిలీజ్ కాకముందే అవార్డు.. ఫొటోస్ చూశారా?
Sukumar Family
Follow us
Basha Shek

|

Updated on: Jan 02, 2025 | 5:59 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సుకుమార్. ఆర్య తో మొదలైన ఆయన ప్రయాణం పుష్ప 2 పీక్స్ కు చేరింది. కేవలం దర్శకుడిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా లెక్కల మాస్టర్ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు ఆయన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడిచేందుకు రెడీ అయిపోయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది ఈ సినిమాను తెరకెక్కించారు. సుకుమార్‌ రైటింగ్స్, గోపీటాకీస్‌ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు ఈ సినిమాను నిర్మించారు. సుకుమార్ భార్య, శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పకురాలుగా వ్యవహరించారు. రిలీజ్ కు ముందే గాంధీ తాత చెట్టు రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ సినిమా ఎన్నో అవార్డులు కూడా కైవసం చేసుకుంది. ఇక ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా అవార్డు అందుకుంది. దీంతో సుకుమార్ కూతురిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

గాంధీ తాత చెట్టు సినిమా జనవరి 24 న తెలుగులో రిలీజ్ కానుంది. మొత్తానికి రిలీజ్ ముందే నెట్టింట ట్రెండ్ అవుతోంది సుకుమార్ కూతురు. సుకుమార్ – తబిత దంపతులకు ఇద్దరు సంతానం. కూతురి పేరు కాగా కుమారుడి పేరు సుక్రాంత్. గాంధీ తాత చెట్టు గురించి దర్శకురాలు మాట్లాడుతూ.. ‘ గాంధీజీ సిద్ధాంతాల్ని పాటిస్తూ.. ఓ పదమూడేళ్ల అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. తన గ్రామాన్ని కాపాడుకునేందుకు ఆ అమ్మాయి ఏం చేసిందనేది ఈ చిత్రంలో చూపించాం. నేటి తరం పేరెంట్స్ అందరూ తమ పిల్లలకి ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూపించాలి’ అని కోరారు. ఈ చిత్రంలో సుకృతి వేణితో పాటు ఆనంద్‌ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

గాంధీ తాత చెట్టు సినిమాలో సుకుమార్ కూతురు..

సుకృతి వేణి లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.