Venuswamy: ఇక హిందీలో జాతకాలు షురూ.. ఆ బాలీవుడ్ హీరోయిన్ పై వేణుస్వామి జ్యోతిష్యం.. వీడియో వైరల్..
వేణుస్వామి.. తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. రాజకీయ నాయకులు, సినీప్రముఖుల జాతకాలను విశ్లేషిస్తూ ఇప్పటివరకు చాలా ఫేమస్ అయ్యారు. ఓవైపు హీరోయిన్స్ ఆయన జాతకాలను విశ్వసిస్తూ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మరోవైపు వేణుస్వామిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుంటాయి.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు జ్యోతిష్యుడు వేణుస్వామి. సినీ ప్రముఖులు, హీరోయిన్, సెలబ్రెటీ కపూల్స్, రాజకీయ నాయకుల జీవితం.. పర్సనల్ లైఫ్ గురించి.. వారి జాతకాలను విశ్లేషిస్తూ ఆయన చాలా పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో వేణుస్వామి జాతకాల వీడియోలు ఎక్కువగా వైరలవుతుంటాయి. కానీ కొన్నాళ్ల క్రితం హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితం గురించి వేణుస్వామి చేసిన ఓ వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆయన పై కేసులు, గొడవలు జరిగాయి. అయితే ఈ ఘటనల తర్వాత వేణుస్వామి సైలెంట్ అయ్యారు. ఏ సెలబ్రెటీ గురించి జాతకాల విశ్లేషణ చేయలేదు. కానీ తాజాగా టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ హీరోయిన్ గురించి జాతకం చెబుతూ ఓ వీడియో షూరు చేశారు. దీంతో ఇప్పుడు వేణు స్వామి హిందీలో జాతకాలు షూరు చేసినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ వామికా గబ్బి జాతకాన్ని విశ్లేషిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు వేణుస్వామి. పూర్తిగా హిందీలోనే జాతకం చెప్పారు. “ఈ మధ్యకాలంలో ఓ బాలీవుడ్ హీరోయిన్ పేరు బాగా వినిపిస్తుంది. ఆమె పేరు వామికా గబ్బి. ఆమె కళ్లకే ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె చాలా మందికి క్రష్ అయిపోయింది. 2025లో ఆమె జాతకం ఎలా ఉంటుందో చూద్దాం. వామికాది రోహిణి నక్షత్రం, వృషభ రాశి. 2025 ఫిబ్రవరి 10 నుంచిు ఆమెకు గురు మహర్దశ స్టార్ట్ కాబోతుంది. ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తుంది. భవిష్యత్తులో వామికాకు ఇంకా క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆమె ఇంకా పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు సైతం ఉన్నాయి. పెద్ద డైరెక్టర్స్, స్టార్స్ సినిమాల్లో నటించే ఛాన్స్ వస్తుంది. ఫిబ్రవరి 10 నుంచి ఆమెకు రాజయోగం పట్టబోతుంది. 16 ఏళ్లపాటు సినిమాల్లోకి ఆమెకు తిరుగులేదు ” అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. తాజాగా వేణుస్వామి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
వామికా ఇదివరకే తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో ఈ బ్యూటీకి సరైన క్రేజ్ రాలేదు. ఆ తర్వాత హిందీలోనే వరుస ఆఫర్స్ అందుకుంది.
View this post on Instagram
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.