Armaan Malik: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్.. ఫొటోస్ వైరల్.. వధువు ఎవరంటే?
బాలీవుడ్ స్టార్ సింగర్ ఆర్మాన్ మాలిక్ పెళ్లిపీటలెక్కారు. హిందీతో పాటు తెలుగులోనూ వందలాది పాటలు పాడిన అతను తన ప్రియురాలు ఆష్నా ష్రాఫ్ కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. రెండేళ్ల క్రితమే ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ లవ్ బర్డ్స్ ఇప్పుడు ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ తన స్నేహితురాలు ఆష్నా ష్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఎవరికీ తెలియకుండా రహస్యంగా వీరు పెళ్లి పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. అర్మాన్ తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలు చూసి అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అర్మాన్, ఆష్నా చాలా సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 2023లో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా తమ ప్రేమ బంధాన్ని ప్రకటించారు. మొత్తానికి ఈరోజు ఇద్దరూ పెళ్లి తో ఒక్కటయ్యారీ ప్రేమ పక్షలు. అయితే అర్మాన్ తమ పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచడంపై చర్చ జరగుతోంది. కాగా కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన అర్మాన్, ఆష్నాలకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు వైరలవుతున్నాయి. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షల తెలుపుతున్నారు.
పెళ్లి సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబయ్యారు అర్మాన్ – ఆష్నా. అర్మాన్ పింక్ కలర్ షేర్వాణీతో ముస్తాబవ్వగా, ఆష్నా నారింజ రంగు లెహంగా, పింక్ కలర్ దుపట్టాను ధరించింది. ఇక పెళ్లి డ్రెస్ కు తగ్గట్టుగా తెల్లటి ముత్యాలు, చెవిపోగులు, కంకణాల హారం అష్నా అందాన్ని రెట్టింపు చేశాయి. ఇదిలా ఉంటే, అర్మాన్ మాలిక్ కంటే ఆష్నా రెండేళ్లు పెద్దది. అర్మాన్ వయస్సు 29 సంవత్సరాలు. ఆష్నా వయస్సు 31 సంవత్సరాలు.
అర్మాన్ మాలిక్ పెళ్లి ఫొటోలు..
View this post on Instagram
పేరుకు బాలీవుడ్ సింగర్ అయినప్పటికీ తెలుగులోనూ వందలాది పాటలు పాడాడు అర్మాన్ మాలిక్. 2010 రక్త చరిత్ర మొదలుకుని మొన్నటి కమిటీ కుర్రాళ్ల వరకు పలు హిట్ సినిమాల్లో పాటలు ఆలపించాడు అర్మాన్. హలో (హలో), రెండు కళ్లు (మహాను భావుడు), నిన్నిలా నిన్నిలా.. (తొలి ప్రేమ), కంటి పాప (వకీల్ సాబ్ ), బుట్ట బొమ్మ (అల వైకుంఠపురములో), నో పెళ్లి ( సోలో బతుకే సో బెటర్ ), పడి పడి లేచే (పడి పడి లేచే మనసు), ఓ ఇషా.. (మేజర్), డేంజర్ పిల్లా (ఎక్స్ ట్రార్డినరి మ్యాన్) ఇటీవల అర్మాన్ పాడిన పాటలకు కొన్ని ఉదాహరణలు
అర్మాన్ మాలిక్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.