Squid Game 2: ఓటీటీలో రికార్డ్స్ బద్దలుకొడుతున్న స్క్విడ్ గేమ్స్ 2.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లో ప్రతివారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులకు ఆకట్టుకునేందుకు సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా, హారర్, రొమాంటిక్ ప్రేమకథలను విడుదల చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఓటీటీలో రికార్డ్స్ బద్దలుకొడుతుంది ఓ వెబ్ సిరీస్. ప్రపంచవ్యాప్తంగా జనాలను తెగ ఆకర్షిస్తుంది. అదే స్క్విడ్ గేమ్స్ 2.

Squid Game 2: ఓటీటీలో రికార్డ్స్ బద్దలుకొడుతున్న స్క్విడ్ గేమ్స్ 2.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..
Squid Games Season 2,
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 02, 2025 | 4:45 PM

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 సినిమా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మరోవైపు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లో పలు సినిమాలు, వెబ్ స్టోరీస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ రికార్డ్స్ బద్దలు కొడుతుంది స్క్విడ్ గేమ్స్ 2. గతంలో కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఓటీటీ కంటెంట్ కు విపరీతమైన ఆదరణ పెరిగింది. బింగీ వాచ్ పేరుతో ప్రజలు కూడా గంటల తరబడి వెబ్ సిరీస్‌లు చూశారు. ‘మనీ హీస్ట్’, ‘స్క్విడ్ గేమ్స్’, ‘బుధవారం’, ‘బెటర్ కాల్ సోల్ వంటి వెబ్ సిరీస్ అప్పట్లో జనాలను కట్టిపడేశాయి. ఇక అదే సమయంలో ఎక్కువగా పాపులర్ అయిన స్క్విడ్ గేమ్స్ సీజన్ 2 ఇప్పుడు విడుదలైంది. రెండవ సీజన్ సైతం మొదటి సీజన్ మాదిరిగానే రికార్డ్స్ సృష్టిస్తుంది.

కొరియన్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్స్’ థ్రిల్లర్ రియాల్టీ షోకి సంబంధించినది. అవకాశాల కోసం ఆటలు ఆడడం.. ఎవరు ఓడిపోతే వారిని చంపే గేమ్ ఇది. గతంలో విడుదలైన ‘స్క్విడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఉండడంతో భారీ విజయాన్ని సాధించింది. విడుదలైన కొన్ని వారాల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో మిలియన్ల గంటల ప్రసారాన్ని రికార్డ్ చేసింది. ఇప్పుడు ‘స్క్విడ్ గేమ్స్ 2′ నెట్‌ఫ్లిక్స్ అనేక రికార్డులను బద్దలు కొట్టింది.’స్క్విడ్ గేమ్స్ 2’ విడుదలైన ఒక్క వారంలోనే 60.8 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. మొదటి వారంలోనే దాదాపు ఏడు కోట్ల మంది ‘స్క్విడ్ గేమ్స్ 2’ వెబ్ సిరీస్‌ని చూశారు. అంతకుముందు ‘బుధవారం’ వెబ్ సిరీస్‌కి మొదటి వారంలో దాదాపు 5 కోట్ల వ్యూస్ వచ్చాయి. ‘స్క్విడ్ గేమ్స్ 2’ విడుదలైన మొదటి వారంలో ఏడవ అత్యంత ప్రజాదరణ పొందిన ఆంగ్లేతర వెబ్ సిరీస్‌గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్ మొదటి స్థానంలో నిలవడం ఖాయం.

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్‌ల జాబితాలో ‘స్క్విడ్ గేమ్‌ల సీజన్ 1’ మొదటి స్థానంలో ఉంది. కొరియన్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’, ‘బుధవారం’, ‘బ్రిడ్జర్టన్’ వంటి ప్రముఖ ఆంగ్ల వెబ్ సిరీస్‌లను అధిగమించింది. ఈ జాబితాలో ‘మనీ హీస్ట్’ ఐదవ స్థానంలో ఉంది. ఇప్పుడు ‘స్క్విడ్ గేమ్స్ 2’ రికార్డ్స్ సృష్టిస్తుంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.