Pawan Kalyan: మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్ రియాక్షన్..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్.. తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఇప్పటికే ఒప్పుకొన్న సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న గ్యాంగ్‌స్టర్ మూవీ ‘ఓజీ’. ఇటీవల పవన్ ఎక్కడకు వెళ్లినా, ‘ఓజీ.. ఓజీ..’ అంటూ అభిమానులు నినాదాలు చేస్తున్నారు. అభిమానులు అలా అనగానే నవ్వుకునే పవన్.. కడపలో మాత్రం అసహనం వ్యక్తం చేశారు.
‘‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియదు మీకు.. పక్కకు జరగండి’’ అంటూ అసహనం ప్రదర్శించారు. ‘‘ఓజీ 1980-90ల మధ్య జరిగే కథ. OG అంటే.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అభిమానులు ఎక్కడికి వెళ్లినా.. ‘OG OG’ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి. నేను ఒప్పుకొన్న అన్ని సినిమాలకూ డేట్స్ ఇచ్చాను. ‘హరిహర వీరమల్లు’ మరో ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే ఉంది. ఒకదాని తర్వాత ఒకటి అన్ని చిత్రాలు పూర్తి చేస్తాను’’ అని అన్నారు. అంతేకాదు, ‘‘సినిమా పరిశ్రమలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్. పరిశ్రమలోని వారందరూ కూర్చొని మాట్లాడాలి. రాష్ట్రంలో పాపికొండలు వంటి చక్కటి లొకేషన్లు ఉన్నాయి. విజయనగరం అటవీ ప్రాంతంలోనూ అందమైన ప్రదేశాలున్నాయి. ఈ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు అవసరం. ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలి. స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ రావాలి. అప్పుడే మంచి సినిమాలు సాధ్యం’’ అని పవన్‌కల్యాణ్ అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

