చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోయే సినిమా కోసం అభిమానులు ఇప్పట్నుంచే ఆసక్తిగా వేచి చూస్తున్నారు. దీనిపై నిర్మాత సుధాకర్ చెరుకూరి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో రానుందని తెలిపారు. అంతేకాదు.. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రానున్న పారడైజ్ కూడా పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లోనే రానుంది.