నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో వస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. తాజాగా ఈ షోకు విక్టరీ వెంకటేష్ అతిథిగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ విడుదలైంది. ఇందులో వెంకీ మామ చెప్పిన కబుర్లు హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా వెంకటేష్, బాలయ్య మధ్య బాండింగ్ ఎపిసోడ్‌కు మేజర్ హైలైట్ అయింది.