Akhil Akkineni: అఖిల్ ప్లానింగ్ మాములుగా లేదుగా.. ఈ సారి కుంభస్థలం బద్దలు కొట్టడం ఖాయం

ఈ సారి ఏం చేసినా పక్కాగా చేయాలి.. అస్సలు కంగారు పడొద్దు.. కాంప్రమైజ్ అవ్వొద్దు.. కొడితే కుంభస్థలమే అన్నట్లు సాగుతున్నాయి అఖిల్ ప్లానింగ్స్. ఏజెంట్ తర్వాత గ్యాప్ తీసుకున్న అయ్యగారు.. అన్నింటికి వర్త్ వర్మ వర్త్ అంటున్నారు. మరి అఖిల్ ఇప్పుడేం చేస్తున్నారు..? ఆయన కొత్త సినిమా సైలెంట్‌గా స్టార్ట్ అయిందా..?

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Jan 02, 2025 | 1:33 PM

ఎంత బ్యాకప్ ఉన్నా.. బ్యాగ్రౌండ్ ఉన్నా అదృష్టం అనేది లేకపోతే హిట్టు రావడం కష్టమే. దానికి అఖిల్ అక్కినేని ప్రత్యక్ష నిదర్శనం. అన్నీ ఉన్నా అనే సామెత ఉంది కదా.. అలా ఉందిప్పుడు అఖిల్ పరిస్థితి. మంచి మంచి కథలు, పెద్ద దర్శకులతో పని చేసినా అఖిల్‌కు హిట్ రాలేదు.

1 / 5
అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం చాలా టైమ్ తీసుకుంటున్నారు అక్కినేని వారసుడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కాస్త పర్లేదనిపించినా.. ఏజెంట్ మాత్రం డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో వచ్చిన ఆ కాస్త మార్కెట్ కూడా ప్రమాదంలో పడింది.

2 / 5
ప్రస్తుతం ఈయన వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరుతో సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎలాంటి సందడి లేకుండా మొదలైనట్లు తెలుస్తుంది.  అఖిల్ కొత్త సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

3 / 5
ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో మురళీ కిషోర్, అఖిల్ సినిమా షూట్ మొదలైందని.. ఓ సెట్‌లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

4 / 5
మురళీ కిషోర్ అబ్బూరుతో పాటు మరో సినిమాను కూడా ఓకే చేసారు అఖిల్. యువీ క్రియేషన్స్‌లో అనిల్ అనే కొత్త దర్శకుడితోనూ అఖిల్ సినిమా ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రావడానికి ఇంకా టైమ్ పట్టొచ్చు. పూర్తిగా విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమా ఇది. మొత్తానికి కాస్త నెమ్మదించినా.. వర్త్ వర్మ వర్త్ అంటున్నారు.

5 / 5
Follow us