New Changes 2025: కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
ప్రతీ నెలా ప్రారంభంలో ఆధార్ కార్డు నుండి గ్యాస్ సిలిండర్ వరకు ప్రతిదానిలో కొన్ని పెద్ద మార్పులు ఉంటుంటాయి. ఇప్పుడు డిసెంబర్ నెల ముగుస్తోంది. జనవరి నెల రాబోతోంది. పైగా కొత్త ఏడాది మొదలవుతుంది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఉద్యోగుల భవిష్య నిధి.. ఇలా చాలా అంశాల్లో పలు మార్పులు జరుగనున్నాయి. మరి కొత్త ఏడాదిలో.. జనవరి నెలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వివరంగా చూద్దాం.
గ్యాస్ సిలిండర్ ధర సంగతి చూస్తే.. ప్రతీ నెల ప్రారంభంలో చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. గత కొన్ని నెలలుగా గృహావసరాల గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పులు లేవు. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ స్థితిలో జనవరిలో గ్యాస్ సిలిండర్ ధరల్లో పెనుమార్పు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఇటు గృహ వినియోగదారులు, అటు వాణిజ్య అవసరాలకు గ్యాస్ వినియోగించేవారు.. టెన్షన్ పడుతున్నారు. గ్యాస్ ధర ఎంత పెరుగుతుందో అని అంచనా వేస్తున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంగతి చూస్తే.. పీఎఫ్ ఖాతాలో జమ అయిన డబ్బును.. ఉద్యోగులు తమ అవసరాలకు వినియోగించుకోవాలంటే కచ్చితంగా ఆమోదం కావాలి. దీని కోసం కొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఇకపై అలాంటి టెన్షన్ ఉండదని చెబుతున్నారు. ఎందుకంటే EPFO త్వరలో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది. ఇక్కడ ఉద్యోగులు తమ ఖాతాల నుండి విత్ డ్రాను స్వయంగా చేసుకోవచ్చు. అంటే ఉద్యోగే స్వయంగా తనకు తానుగా ఆమోదం పొందేలా చేసుకోవచ్చు.
కార్ల ధర పెంపు ఎలా ఉంటుందో చూద్దాం. జనవరి నుంచి కొత్త కారు కొనాలంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అంటే, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా సహా ప్రధాన కంపెనీలు తమ వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచబోతున్నాయి. దీనివల్ల వచ్చే జనవరి నుంచి కారు ధర పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇయర్ ఎండ్ లోనే కార్ల బుకింగ్ కోసం ట్రై చేస్తున్నారు. ఒకవేళ జనవరిలో కొనాలంటే.. ఎంత మొత్తం అదనంగా పెట్టాలని అని లెక్కలు వేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ గురించీ ఓ అప్ డేట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌లో చాలా కొత్త రూల్స్ రానున్నాయి. అంటే మీరు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ని ఉపయోగించి రెండు డివైజ్ లలో మాత్రమే చూడవచ్చు. మూడో వ్యక్తి ఇదే ఖాతాను ఉపయోగించి మరొక టీవీలో చూడాలనుకుంటే.. కచ్చితంగా అతను మెంబర్ షిప్ తీసుకోవాల్సిందే. దీంతో అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు అలెర్టయ్యారు. UPI మనీ లావాదేవీ గురించీ ఓ అప్ డేట్ ఉంది. UPI 123 చెల్లింపు లావాదేవీ పరిమితిని పెంచింది. గతంలో UPI 123 పే.. రూ.5,000కే పరిమితం కాగా, ఇప్పుడు దాన్ని రూ.10,000కు పెంచారు. జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుంది. దీంతో ఒకేసారి ఎక్కువ మొత్తాన్ని పంపించడానికి అవకాశం ఏర్పడింది. UPI 123 పేని ఉపయోగించేవారికి ఇది నిజంగా లాభదాయకమే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.