- Telugu News Photo Gallery Cinema photos Jani Master Daughter Aaliyahs Birthday Celebrations In Jaat Movie Set, See Photos
Jani Master: గ్రాండ్‌గా జానీ మాస్టర్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్స్.. సందడి చేసిన సినీ తారలు.. ఫొటోస్ ఇదిగో
ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కు పాల్పడినట్లు ఆరోపణులు ఎదుర్కొన్నాడు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఈ కేసులో కొన్ని రోజుల పాటు జైలులో కూడా ఉన్నాడు జానీ. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు.
Updated on: Apr 03, 2025 | 9:44 PM

జైలు నుంచి వచ్చిన తర్వాత రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ తో పాటు పలు సినిమాలకు నృత్య రీతులు సమకూర్చాడు.

ఆ మధ్యన ఓ కన్నడ సినిమా సెట్ లోనూ సందడి చేశాడు. అలాగే సన్నీ డియోల్- గోపిచంద్ మలినేని సినిమా జాట్ కు కూడా జానీనే కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.

తాజాగా జాట్ సినిమాలోనే జానీ మాస్టర్ కూతురు అలియా పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడీ స్టార్ కొరియోగ్రాఫర్.

హీరోయిన్ రెజీనా, రణ్ దీప్ హుడా, రవిశంకర్, డైరెక్టర గోపీ చంద్ మలినేని తదితరులు జానీ మాస్టర్ కూతురికి బర్త్ డే విషెస్ చెప్పి దీవెనలు అందించారు.

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లొచ్చిన జానీ మాస్టర్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.




