Jani Master: దిష్టి తీసి, హారతిచ్చి.. కొత్త సినిమా సెట్‌లో జానీ మాస్టర్‌కు గ్రాండ్ వెల్కమ్.. వీడియో ఇదిగో
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి రిలీజైన తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషా సినిమాల్లోనూ ఈ డ్యాన్స్ మాస్టర్‌కు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా మరో కొత్త మూవీ సెట్‌లోకి అడుగు పెట్టాడు జానీ మాస్టర్.

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలయ్యాడు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే జానీ తిరిగి వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఇంటికే పరిమితమయ్యాడు. అదే సమయంలో కేసుల కారణంగా పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఛాన్సులు జానీకి దూరమయ్యాయి. తాను ఏ తప్పూ చేయలేదని.. విచారణలో అన్ని నిజాలు బయటికొస్తాయంటోన్న జానీ ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. తాజాగా అతనికి మరో సినిమా అవకాశం వచ్చింది. కన్నడలో తెరకెక్కుతోన్న ఓ సినిమాకు జానీ వర్క్ చేయనున్నాడు. తాజాగా తన కొత్త సినిమా సెట్ కు వెళ్లాడు మాస్టర్. అక్కడ అతనికి ఊహించని స్వాగతం లభించింది. జానీ మాస్టర్‌కి గుమ్మడి కాయతో దిష్టి తీసి హారతిచ్చి సెట్స్‌లోకి ఆహ్వనించారు. అనంతరం కేక్ కట్ చేయించి మరీ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇంతటి ఘన స్వాగతం చూసి జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. అందరికీ థ్యాంక్స్ చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడీ స్టార్ కొరియోగ్రాఫర్.
“చాలా రోజుల తర్వాత బెంగళూరులో అడుగుపెట్టాను. యూవర్స్ సిన్సియర్లీ రామ్ సెట్స్‌లో అడుగుపెట్టిన నాకు ఇంతటి ఘన స్వాగతం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చిన ఈ మూవీ టీమ్ ప్రతి ఒక్కరికీ ఎంతో రుణపడి ఉంటాను’ అంటూ జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
Stepped into #Bangalore after a verly long time and I’m extremely overwhelmed by the warm welcome on the sets of #YoursSincerelyRaam 🥹❤️
Extremely grateful to each and everyone from the Team for the opportunity and support🙏🏻@Official_Ganesh @Ramesh_aravind #VikyathAR… pic.twitter.com/AJzIZ4c1Ra
— Jani Master (@AlwaysJani) February 3, 2025
జానీ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ చేస్తున్నారు. మీకు మరిన్ని సినిమా ఛాన్సులు రావాలి. మళ్లీ బిజీ అవ్వాలి’ అని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
పునీత్ రాజ్ కుమార్, రాజ్ కుమార్ సమాధుల వద్ద జానీ మాస్టర్..
Paid homage and took the blessings of legendary #Rajkumar garu #Parvathamma garu & #PuneethRajkumar Sir at Dr. #RajkumarMemorial before starting on my next project in #Bangalore 🙏🏻✨ pic.twitter.com/7gn6HRCvOT
— Jani Master (@AlwaysJani) January 28, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..