- Telugu News Photo Gallery Cinema photos Pooja hegde and sreeleela doing same mistake again know the details here
హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో మళ్లీ అదే తప్పు చేస్తున్న పూజ, శ్రీలీల
ఒకప్పుడు వెండితెర మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇద్దరు అందాలు భామలు ఇప్పుడు టఫ్ టైమ్‌ను ఫేస్ చేస్తున్నారు. గతంలో చేసిన సినిమాలతో వచ్చిన క్రేజ్ ఇన్నాళ్లు కెరీర్‌కు ఉపయోగపడింది. కానీ ఇక మీద అవకాశాలు రావాలంటే మాత్రం అప్ కమింగ్ సినిమాలతో కంపల్సరీగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు ఈ బ్యూటీస్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Feb 03, 2025 | 9:55 PM

రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో పెళ్లి సందడి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ శ్రీలీల. తొలి మూవీతోనే అందం అభినయంతో పాటు బెస్ట్ డ్యాన్సర్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. ఆ తరువాత ధమాకా, భగవంత్ కేసరి లాంటి హిట్స్ వచ్చినా... స్కంద, ఆదికేశవ లాంటి మూవీస్ అమ్మడి కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి.

ఒకేసారి నాలుగైదు సినిమాలకు కమిట్ అవ్వటంతో అన్ని సినిమాలకు సరిగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడ్డారు శ్రీలీల. ఈ విషయంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అదే సమయంలో వరుస ఫ్లాప్‌లతో కెరీర్ గాడి తప్పింది. ఇప్పుడు మళ్లీ అవకాశాలు వస్తున్నా.. అమ్మడి తీరు మాత్రం మారటం లేదు. మరోసారి ఎడా పెడా సినిమాలకు ఓకే చెప్పేసి డేట్స్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు ఈ క్యూట్ బ్యూటీ.

ఆ మధ్య వరుస సినిమాలతో పాన్ ఇండియా రేసులో ఫ్లాష్ అయిన పూజ హెగ్డే తరువాత సడన్‌గా స్లో అయ్యారు. రాధేశ్యామ్ లాంటి సినిమాలు తన కెరీర్‌ను మలుపు తిప్పుతాయన్న ఆశలతో వచ్చిన అవకాశాలు వదులుకొని ఇబ్బందుల్లో పడ్డారు.

ఆ టైమ్‌లోనే కాలు ఫ్యాక్చర్ కావటంతో పూజ కెరీర్‌లో గ్యాప్ వచ్చింది.ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్న పూజా హెగ్డే, మరోసారి పాత తప్పునే రిపీట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాల రిజల్ట్ చూశాకే కొత్త సినిమాలకు సైన్ చేయాలనుకుంటున్నారు పూజా. అందుకే తనని వెతుక్కుంటూ వస్తున్న ప్రాజెక్ట్స్‌ను కూడా వదులుకుంటున్నారు. దీంతో మరోసారి పూజ కెరీర్ గాడి తప్పుతోందా అని టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్.





























