- Telugu News Photo Gallery Cinema photos Buchi babu using 20 years back Old technology using Ram Charan's RC16
RC16: రామ్‌చరణ్ సినిమా కోసం పాత టెక్నాలజీ
ఎక్కడైనా టెక్నాలజీతో ఓ అడుగు ముందుకేసి తమ సినిమాలు తెరకెక్కించాలనుకుంటారు దర్శకులు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్‌లో జరుగుతుంది. రామ్ చరణ్ సినిమా కోసం 20 ఏళ్ళు వెనక్కి వెళ్తున్నారు బుచ్చిబాబు. మేకింగ్‌లో ఒకప్పటి టెక్నాలజీని మళ్లీ కెమెరా ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఆయనలా ఎందుకు చేస్తున్నారు..? కారణమేంటి..?
Updated on: Feb 03, 2025 | 9:49 PM

గేమ్ ఛేంజర్‌కు ఫలితంతో పని లేకుండా నటుడిగా మరో మెట్టు ఎక్కారు రామ్ చరణ్. ముఖ్యంగా అప్పన్న పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చరణ్ ఫోకస్ అంతా బుచ్చిబాబు సినిమాపైనే ఉంది.

ఈ చిత్ర షూటింగ్ నాన్‌స్టాప్‌గా నడుస్తుంది. దీనికోసం కొత్తగా పాతకాలం టెక్నాలజీని వాడుకోబోతున్నారు బుచ్చిబాబు. ఇదే ట్రెండింగ్ న్యూస్ ఇప్పుడు. ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగమే.. అన్నింటికీ హార్డ్ డిస్కులే.

ఈ చిత్ర షూటింగ్ నాన్‌స్టాప్‌గా నడుస్తుంది. దీనికోసం కొత్తగా పాతకాలం టెక్నాలజీని వాడుకోబోతున్నారు బుచ్చిబాబు. ఇదే ట్రెండింగ్ న్యూస్ ఇప్పుడు. ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగమే.. అన్నింటికీ హార్డ్ డిస్కులే.

అందుకే RC16 కోసం సినిమాటోగ్రఫర్ రత్నవేలు సినిమాలో కొంత భాగానికి నెగటివ్ రీల్ వాడనున్నట్లు తెలుస్తుంది. RC16 పీరియడ్ సినిమా కాబట్టి.. రీల్‌తో షూట్ చేస్తే బాగుంటుందనేది రత్నవేలు ఆలోచన.

హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలెన్ ఓపెన్ హైమర్ సినిమాను ఇలాగే షూట్ చేసి రీల్స్ భద్రపరిచారు. హై బడ్జెట్ క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాలేదు. తాజాగా RC16లో కొంత భాగానికే ఇదే చేయాలని చూస్తున్నారు. ఇది వర్కవుట్ అయితే.. టాలీవుడ్‌లో మళ్లీ నెగిటివ్ రీల్ మేకింగ్‌కు ఊపొస్తుందేమో..?




