- Telugu News Photo Gallery Cinema photos heroines like Malavika Mohanan deepika padukone kriti sanon surprised for prabhas hospitality
Prabhas: డార్లింగ్ ఆతిథ్యానికి ఫిదా అవుతున్న బ్యూటీస్
డార్లింగ్ ప్రభాస్ అంటే పాన్ ఇండియా రికార్డులు, లార్జర్‌దాన్ లైఫ్ సినిమాలు మాత్రమే కాదు. అసలు సిసలు తెలుగు ఆతిథ్యం కూడా. అందుకే ప్రభాస్‌తో సినిమా అంటే డైట్ మెయిన్‌టైన్ చేయటం కష్టమని ఫీల్ అవుతారు మిగితా యాక్టర్స్. తన కొత్త సినిమా హీరోయిన్‌ని కూడా తన స్టైల్ ఆతిథ్యంలో సర్‌ప్రైజ్ చేసి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు డార్లింగ్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Feb 03, 2025 | 9:44 PM

ప్రజెంట్ హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ రొమాంటిక్ వార్ డ్రామాలో నటిస్తున్నారు డార్లింగ్ ప్రభాస్. ఈ సినిమాతో సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయన్సర్ ఇమాన్వీ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.

ప్రజెంట్ డార్లింగ్‌తో షూటింగ్‌లో పాల్గొంటున్న ఇమాన్వీ, ప్రభాస్ తనకోసం పంపించిన ఫుడ్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. డార్లింగ్ ఇలా తన హీరోయిన్లకు ఫుడ్ పంపించటం ఇదే మొదటి సారేం కాదు.

సలార్ సినిమా షూటింగ్ టైమ్‌లో ప్రభాస్ మెను గురించి వరుస అప్‌డేట్స్ ఇచ్చారు శ్రుతి హాసన్. ఏకంగా 40 రకాల వంటలను తనకు పంపించారంటూ తన ఎగ్జైట్మెంట్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రభాస్ లంచ్ మెనుకి బాలీవుడ్ స్టార్స్ కూడా ఫిదా అయ్యారు.

డార్లింగ్ హాస్పిటాలిటీ గురించి సినిమా వేదికల మీద కూడా మాట్లాడారు దీపిక. తనకు ప్రభాస్ పంపించిన లంచ్ ఐటమ్స్‌ను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. కల్కి 2898 ఏడీ షూటింగ్ సమయంలోనే దిశా కూడా డార్లింగ్‌తో కలిసి బాహుబలి లంచ్‌ను షేర్ చేసుకున్నారు.

ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న 'ది రాజాసాబ్' హీరోయిన్లు కూడా ప్రభాస్ లంచ్ టేస్ట్ చేసిన వారే. ఆదిపురుష్ షూటింగ్ టైమ్‌లో హీరోయిన్ కృతి సనన్‌తో పాటు ఆ సినిమాలో రావణుడిగా నటించిన సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్‌కు కూడా స్పెషల్ బిర్యానీ పంపించారు డార్లింగ్ ప్రభాస్.





























