AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thandel Movie: ‘అప్పుడు నా భార్య ఏడు నెలల గర్భంతో ఉంది’.. రియల్ తండేల్ రాజు ఇతనే.. కథ వింటే కన్నీళ్లాగవు

అక్కినేని హీరో నాగచైతన్య, బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. లవ్ స్టోరీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి ఈ జోడి కనువిందు చేయనుంది. మత్స్యకారుల నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా తండేల్ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ చందూ మొండేటి.

Thandel Movie: 'అప్పుడు నా భార్య ఏడు నెలల గర్భంతో ఉంది'.. రియల్ తండేల్ రాజు ఇతనే.. కథ వింటే కన్నీళ్లాగవు
Thandel Movie
Basha Shek
|

Updated on: Feb 04, 2025 | 7:19 AM

Share

లవ్ స్టోరీ తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం తండేల్. కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించాడు. బన్నీ వాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు, కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తండేల్ ఫిబ్రవరి 07న విడుదల కానుంది.. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్‌ అనే మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నాడు. మత్స్యకారుల నేపథ్యంలో కొన్ని యధార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కొందరు భారత జాలర్లు పొరపాటున పాక్‌ భూభాగంలోకి వెళ్లడం, పాక్ కోస్ట్ గార్డ్స్ వారిని అదుపులోకి తీసుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో తండేల్ మూవీని తెరకెక్కించారు. కాగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రియల్ తండేల్ రాజ్(తండేల్ రామారావు) హాజరయ్యారు. తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను రామారావు వివరించారు.అలాగే పాకిస్తాన్ జైలులో ఎలాంటి కష్టాలు పడ్డారనే విషయాలను గుర్తు చేసుకున్నారు.

17 నెలల పాటు అక్కడే ..

‘తండేల్ అంటే లీడర్ అని అర్థం. మిగతా జాలరులు అందరూ తండేల్ ను అనుసరిస్తారు. ఎన్ని ఎక్కువ చేపలు పడితే అంత పేరు వస్తుంది. వేటకు వెళ్లేముందు ఇదే లాస్ట్ ట్రిప్ అని నా భార్యకు చెప్పి వెళ్లాను. అప్పుడు ఆమె ఏడు నెలల గర్భంతో ఉంది. 29 రోజులు సముద్రంలో వేట బాగానే సాగింది. అయితే వెనక్కి తిరిగి రావాలని అనుంటున్నప్పుడు అనుకోకుండా పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయాం. దీంతో గుండెజారిపోయినంత పనైంది. పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ కి చిక్కి జైలుకు వెళ్లినప్పుడు బాగా ఏడ్చేశాం. దాదాపు అక్కడే 17 నెలలపాటు మగ్గిపోయాం. అయితే ధైర్యంగా పోరాడాం. కాబట్టే పాకిస్తాన్ జైలు నుంచి బయటకు వచ్చాం’ అని అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నారు తండేల్ రామారావు.

ఇవి కూడా చదవండి

 తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రియల్ తండేల్ రామారావు ఫ్యామిలీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పిండి రుబ్బే పనే లేదు.. ఓట్స్‌తో అదిరిపోయే నాన్ వెజ్ టిఫిన్
పిండి రుబ్బే పనే లేదు.. ఓట్స్‌తో అదిరిపోయే నాన్ వెజ్ టిఫిన్
నిరుద్యోగులకు శుభవార్త.. మరో DSCకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
నిరుద్యోగులకు శుభవార్త.. మరో DSCకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.
రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే జరిమానా పడుతుందా..?
రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే జరిమానా పడుతుందా..?
కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు
కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే