AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monalisa Bhonsle: ‘ఈరోజు పోస్టర్ బయట.. రేపు థియేటర్ లోపల’.. ఐకాన్ స్టార్‌తో మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసా

ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది మోనాలిసా భోంస్లే. జీవనో పాధి కోసం పూస‌ల దండ‌లు, రుద్రాక్ష‌లు అమ్ముకునేందుకు కుంభమేళాకు వ‌చ్చిన ఈ మధ్యప్రదేశ్‌ అమ్మాయి ఊహించని విధంగా సెన్సేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏకంగా సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది.

Monalisa Bhonsle: 'ఈరోజు పోస్టర్ బయట.. రేపు థియేటర్ లోపల'.. ఐకాన్ స్టార్‌తో మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసా
Monalisa Bhonsle
Basha Shek
|

Updated on: Feb 04, 2025 | 8:07 AM

Share

మహా కుంభమేళా కారణంగా ఓవర్‌ నైట్ ఫేమస్ అయిపోయిన వారిలో మోనాలిసా భోంస్లే ఒకరు. మధ్య ప్రదేశ్ ఇండోర్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ అమ్మాయి జీవనో పాధి కోసం కుంభమేళాకు వచ్చింది. పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటూ కొందరు యూట్యూబర్ల కంట పడింది. అంతే క్షణాల్లోనే మోనాలిసా ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలైపోయాయి. దేశ వ్యాప్తంగా ఈ అమ్మాయి పేరు మార్మోగిపోయింది. ఎంతలా అంటే మోనాలిసాను వెతుక్కుంటూ ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఆమె ఇంటికి వెళ్లిపోయాడు. తనతో సినిమా తీసేందుకు రెడీ అయిపోయాడు. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన కొత్త సినిమా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్‌’ లో మోనాలిసా నటించనుంది. ఇటీవలే డైరెక్టర్ ఆమె ఇంటికి వెళ్లి మరి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక సినిమా ఆఫర్ రావడంతో మోనాలిసాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే మోనాలిసా తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ పోస్టర్ తో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అంతే కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటో నెట్టింట వైరలైపోయింది.

‘ఈ రోజు పోస్టర్‌తో బయట ఉన్నా.. రేపటి రోజున థియేటర్లో కనిపిస్తా.. త్వరలోనే ముంబయిలో కలుద్దాం.. అల్లు అర్జున్‌ పుష్ప-2’ అంటూ తన పోస్ట్ కు క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చింది మోనాలిసా. దీనిని చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మోనాలిసాకు అల్ ది బెస్ట్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

పుష్ప 2 పోస్టర్ తో మోనాలిసా..

కాగా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్‌’ లో మోనాలిసా రిటైర్డ్ ఆర్మీ అధికారి కూతురిగా కనిపించనుందని సమాచారం. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు కూడా ఈ సినిమాతోనే తెరంగ్రేటం చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మోనాలిసా సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..