AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grammy Awards 2025: భర్త ముందే దుస్తులన్నీ తీసేసి పోజులు.. గ్రామీ నిర్వాహకులు ఏం చేశారంటే?

అమెరికాకు చెందిన రాపర్ కాన్యే వెస్ట్ భార్య ఆస్ట్రేలియా మోడల్ బియాంకా సెన్సోరి ఇప్పుడ హాట్ టాపిక్ గా మారింది. గ్రామీ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుకలో ఆమె ప్రవర్తించిన తీరును అందరూ తప్పు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బియాంకాను ట్రోల్ చేస్తున్నారు.

Grammy Awards 2025: భర్త ముందే దుస్తులన్నీ తీసేసి పోజులు.. గ్రామీ నిర్వాహకులు ఏం చేశారంటే?
Bianca Censori
Basha Shek
|

Updated on: Feb 03, 2025 | 1:39 PM

Share

సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల వేడుక 2025 అట్టహాసంగా జరుగుతోంది. లాస్ ఏంజెలిస్ వేదికగా జరుగుతోన్న ఈ అవార్డుల వేడుక లో భాగంగా పలువురు అందాల తారలు రెడ్ కార్పెట్‌పై ర్యాంక్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మోడల్‌ బియాంకా సెన్సోరి మాత్రం తన షాకింగ్ ప్రవర్తనతో విమర్శలు మూటగట్టుకుంది. కాగా కాన్యే గ్రామీ అవార్డ్స్‌లో రెండు విభాగాల్లో నామినేట్ అయ్యాడు. దీంతో అతను తన భార్య బియాంకాతో కలిసి గ్రామీ అవార్డు వేడుకలకు హాజరయ్యాడు. కాన్యే బ్లాక్ కలర్ సూట్ లో రాగా, బియాంకా కూడా సేమ్ కలర్ డ్రెస్ లో సందడి చేసింది. అయితే రెడ్ కార్పెట్ మీదకు రాగానే బియాంకా తన నల్లటి కోటు తీసి కనీ కనిపించని ట్రాన్స్ పరెంట్ దుస్తులతో ఫొటోలకు పోజులిచ్చింది. దీంతో అక్కడ ఉన్నవారు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బియాంకా న్యూడ్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఎక్స్‌ (ట్విట్టర్) పేజీలో #BiancaCensori పేరుతో ఆ వీడియో భారీగా వైరల్‌ అవుతుంది.

అయితే హైప్రొఫైల్ ఈవెంట్‌లో బియాంకా ఇలా ప్రవర్తించడం సరికాదంటున్నారు ఈవెంట్ నిర్వాహకులు. దీని తరువాత, కాన్యే, అతని భార్యతో పాటు మరో ఐదుగురిని ఈవెంట్ నుంచి బయటకు పంపించేశారు. గ్రామీ వంటి ప్రతిష్టాత్మక అవార్డు వేడుకలో ఇలా ప్రవర్తించడం ఏం బాగోలేదంటూ ఆస్ట్రేలియా మోడల్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

కాగా కాలిఫోర్నియా చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఇలా అసభ్యకరంగా ప్రవర్తించినందుకు బియాంకాపై కఠిన చర్యలు తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే కాన్యే, బియాంకా లది పబ్లిసిటీ స్టంట్‌ అని, వారిద్దరూ ప్లాన్‌ ప్రకారమే తమ దుస్తుల కంపెనీ బ్రాండ్‌ను వైరల్‌ చేయడానికే ఇదంతా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా గతంలోనూ బియాంక ఇలా వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.