AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: కుప్పకూలిన ఇంగ్లండ్.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగిసింది. ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం (ఫిబ్రవరి 02) ముంబై వేదికగా జరిగిన ఆఖరి టీ20 మ్యాచులోనూ టీమిండియా ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించింది.

IND vs ENG: కుప్పకూలిన ఇంగ్లండ్.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం
TeamIndia
Basha Shek
|

Updated on: Feb 02, 2025 | 10:33 PM

Share

ఐదో టీ20 మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. నిజానికి ఈ మ్యాచ్ కు ముందే సిరీస్‌ను ఇప్పటికే టీమిండియా గెలుచుకుంది. అయితే ఐదో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ కు ఘనమైన ముగింపు పలకాలని టీమిండియా భావించింది. అందుకే తగ్గట్టుగానే ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు అభిషేక్ శర్మ అద్దిరిపోయే ఓపెనింగ్ ఇచ్చాడు. కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా అతడి బ్యాటింగ్‌ జోరు కొనసాగింది.. ఓవరాల్ గా అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.అయితే భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కు శుభారంభమే లభించింది. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు.అయితే భారత బౌలర్లు ఉన్నట్లుండి విజృంభించడంతో వరుసగా వికెట్లు పడ్డాయి. దీంతో 10.3 ఓవర్లలోనే ఇంగ్లండ్ 97 పరుగులకు కుప్పకూలింది. భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ తరఫున ఫిలిప్‌ సాల్ట్‌ బాగా ఆడాడు. 23 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. అయితే మహ్మద్ షమీ 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ ను కుప్పకూల్చాడు. అలాగే వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, అభిషేక్ శర్మ లు తలా 2 వికెట్ల తీసి ఇంగ్లండ పతనాన్ని శాసించారు.

కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. 2012 నుంచి ఈ రెండు జట్లు టీ20 సిరీస్‌లు ఆడుతున్నాయి. అయితే అప్పటి నుంచి ప్రతిసారి టీమ్ ఇండియా చేతిలో ఇంగ్లండ్ ఓడిపోతూనే ఉంది. భారత్‌లో సిరీస్‌ అయినా, ఇంగ్లండ్‌లో జరిగినా..ప్రతిసారీ భారత జట్టునే విజయం వరిస్తోంది.

ఇవి కూడా చదవండి

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే