Actor: 60 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమవుతోన్న స్టార్ హీరో! ఆ అమ్మాయితోనేనా?
భారతీయ సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఈ స్టార్ హీరో కూడా ఒకరు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి అశేష అభిమానులను సొంతం చేసుకున్నారాయన. అదే సమయంలో తన పెళ్లి, విడాకులు, ఇలా వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలిచారు.

సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవరూ ఊహించలేరు. మరీ ముఖ్యంగా ఈ రంగంలో ప్రేమ, పెళ్లి, విడాకుల వంటి పదాలు తరచూ వినిపిస్తుంటాయి. తాజాగా ఆరు పదుల వయసులో ఉన్న స్టార్ హీరో గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకుని తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చేసిన ఆ స్టార్ నటుడు ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ స్టార్ హీరో పెళ్లి గురించే రకరకాల పోస్టులు దర్శనమిస్తున్నాయి. అంతలా ట్రెండ్ అవుతోన్న ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తోన్న ఆయన ఇప్పుడు మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకుని, తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చేసిన ఆమిర్ ఖాన్ జీవితంలోకి మళ్లీ కొత్త ప్రేమ ప్రవేశించిందని సమాచారం. బెంగళూరుకు చెందిన ఓ అమ్మాయితో ఆమిర్ ఖాన్ ప్రేమలో ఉన్నాడని, ఇటీవలే ఆమెను తన కుటుంబ సభ్యులకు పరిచయం కూడా చేశారని బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరనే వివరాలు బయటకు రాలేదు గానీ.. ఆమిర్ ఖాన్ ప్రేమకు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆమోద ముద్ర వేశారని, త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా ఇటీవల అమీర్ ఖాన్ లవ్ యాప చిత్రం ట్రైలర్ ఈవెంట్ లో సందడి చేశాడు. తన కొడుకు జునైద్, ఖుషీ కపూర్‌లతో ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఇప్పటికే రొమాంటిక్ నే అన్నారు. ‘నేను ప్రమాణం చేస్తున్నాను… నేను చాలా రొమాంటిక్‌ని. ఇది తమాషాగా అనిపించవచ్చు కానీ నా భార్యలను అడగండి. అందుకే రొమాంటిక్ సినిమాలు చేస్తాను. నేను నిజమైన ప్రేమను నమ్ముతాను. జీవితంలో ముందుకెళ్తున్న కొద్దీ ప్రేమపై అవగాహన బలపడుతుంది…’ అని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ కు తగ్గట్టుగానే ప్రస్తుతం అమీర్ తన వ్యక్తిగత జీవితంతో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు.