- Telugu News Photo Gallery Cinema photos Anchor Lasya Manjunath takes holy dip at Maha Kumbh Mela, Shares photos
Anchor Lasya: మహాకుంభ మేళాలో యాంకర్ లాస్య.. కుటుంబ సభ్యులతో కలిసి సందడి.. ఫొటోస్ ఇదిగో
ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహా కుంభమేళాకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. సామాన్యులు మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగమవుతున్నారు. తాజాగా టాలీవుడ్ యాంకర్ లాస్య తన కుటుంబ సభ్యులతో కలిసి మహా కుంభమేళాలో సందడి చేసింది.
Updated on: Feb 01, 2025 | 3:36 PM

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా మహా కుంభమేళా అప్రతిహతంగా జరుగుతోంది. ప్రతి రోజూ కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ ఆధ్యాత్మిక వేడుకకు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ యాంకర్ మహా కుంభమేళాను దర్శించుకుంది.

ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న లాస్య అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది.

అనంతరం తన మహా కుంభమేళ పర్యటనకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుందీ టాలీవుడ్ యాంకరమ్మ.

దీంతో యాంకర్ లాస్య ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలువుతున్నాయి. లాస్యతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ మహా కుంభమేళాలో తళుక్కుమంటున్నారు.

ఇక లాస్య గత కొన్నేళ్లుగా టీవీ షోలు, ప్రోగ్రామ్స్ కు దూరంగా ఉంటోంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటోంది.





























