IND vs ENG: అభిషేక్ ధనా ధన్ సెంచరీ.. ఆఖరి టీ20లో టీమిండియా రికార్డు స్కోరు
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. కేవలం 37 బంతుల్లోనే ధనా ధన్ సెంచరీ సాధించి ఇంగ్లండ్ బౌలింగ్ వెన్ను విరిచాడు. శివం దూబే (13 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ముంబైలో టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది.

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోన్న ఐదో టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన గురువు యువరాజ్ తరహాలో మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఓ వైపు సహచరులు వెంట వెంటనే ఔటవుతున్నాఏ మాత్రం నెరవకుండా కేవలం 37 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 54 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 13 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 135 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ చేసింది. మరి ఇంగ్లండ్ జట్టు ఈ టార్గెట్ ను ఛేదిస్తుందా? రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపనుంది కాబట్టి భారత బౌలర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
కాగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ తొలి బంతి నుంచే దూకుడు ప్రదర్శించింది. సంజూ శాంసన్ తొలి బంతికి సిక్సర్ బాదిన తొలి ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. సంజూ శాంసన్ 7 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మ 15 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో నూ సూర్యకుమార్ యాదవ్ కూడా విఫలమయ్యాడు. అతను కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ శివమ్ దూబే 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. హార్దిక్ పటేల్, రింకూ సింగ్ 9 పరుగుల వద్ద ఔటయ్యారు. దీంతో ఒకానొక దశలో 250 పరుగులు దాటుతుందనుకున్న భారత్ స్కోరు 247 పరుగులకే పరిమితమైంది.
Innings Break!
A smashing batting performance from #TeamIndia 🔥🔥
Abhishek Sharma’s incredible TON powers his side to 247/9 👏👏
Over to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/B13UlBNdFP#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/J9b48OVlUy
— BCCI (@BCCI) February 2, 2025
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
End of an explosive 135-run knock from Abhishek Sharma 👏👏
He finishes with 1⃣3⃣ sixes – the most ever for an Indian batter in T20Is in Men’s Cricket 🙌
Live ▶️ https://t.co/B13UlBNdFP#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/Jb9Le56aBX
— BCCI (@BCCI) February 2, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..