IND vs ENG: వాంఖడేలో అభిషేక్ శర్మ విధ్వంసం.. 37 బంతుల్లోనే మెరుపు సెంచరీ.. టీమిండియా స్కోరు ఎంతంటే?

ఇంగ్లండ్ తో జరుగుతోన్న ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడుతూ కేవలం 37 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడు. దీంతో భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది.

IND vs ENG: వాంఖడేలో అభిషేక్ శర్మ విధ్వంసం.. 37 బంతుల్లోనే మెరుపు సెంచరీ.. టీమిండియా స్కోరు ఎంతంటే?
Abhishek Sharma
Follow us
Basha Shek

|

Updated on: Feb 02, 2025 | 8:27 PM

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. సంజూతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన అభిషేక్ తొలి బంతి నుంచే అద్భుతంగా ఆడి కేవలం 37 బంతుల్లోనే మెరుపు సెంచరీని నమోదు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డుల కెక్కాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. కాగా అభి సెంచరీ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 10 సిక్సర్లు  ఉన్నాయి. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 270.27గా ఉంది. కెరీర్ లో అభిషేక్ శర్మకు ఇది రెండో సెంచరీ. ఓవరాల్ గా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. అంతకుముందు, డేవిడ్ మిల్లర్ 2017లో బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 2017లో శ్రీలంకపై రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌పై అభిషేక్ శర్మ 37 బంతుల్లో సెంచరీ సాధించాడు. కాగా పవర్‌ప్లేలో ఆరు ఓవర్లు టీమ్ ఇండియాకు బాగా కలిసొచ్చాయి.  ఈ ఓవర్లలోనే భారత జట్టు రికార్డు స్థాయిలో  వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఇంతలో, అభిషేక్ శర్మ ఒక్కడే 58 పరుగులు  చేశాయి. ఇక తిలక్ వర్మతో కలిసి కేవలం 36 బంతుల్లో 100 పరుగులు జోడించాడు అభిషేక్.

అంతకుముందు కేవలం 17 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా  ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల కెక్కాడు.  12 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన యువరాజ్ సింగ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు

ఇవి కూడా చదవండి

సెంచరీ సాధించిన సంతోషంలో అభిషేక్ శర్మ..

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నో కాంప్రమైజ్ అంటున్న సాయి పల్లవి..
నో కాంప్రమైజ్ అంటున్న సాయి పల్లవి..
వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బిల్ పేమెంట్ ఫీచర్..!
వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బిల్ పేమెంట్ ఫీచర్..!
ఓటీటీలోకి వచ్చేసిన అప్సర రాణి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన అప్సర రాణి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ..
ఆ రోజు పండగ అంటే చూపిస్తాం అంటున్న డార్లింగ్ అండ్ బన్నీ..
ఆ రోజు పండగ అంటే చూపిస్తాం అంటున్న డార్లింగ్ అండ్ బన్నీ..
పసిడి ధరలకు బ్రేక్.. బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
పసిడి ధరలకు బ్రేక్.. బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
మ్యాచ్ మధ్యలో స్నిన్నర్‌గా మారిన పేస్ బౌలర్.. కట్‌చేస్తే..
మ్యాచ్ మధ్యలో స్నిన్నర్‌గా మారిన పేస్ బౌలర్.. కట్‌చేస్తే..
ఈ చిచ్చర పిడుగులు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరోలు
ఈ చిచ్చర పిడుగులు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరోలు
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు పక్కా.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు పక్కా.. 12 రాశుల వారికి వారఫలాలు
పార్టీ ఏది పుష్పా.. 27 ఏళ్ల ఎగిరిన కాషాయజెండా.. పక్కా ప్లాన్‌తో..
పార్టీ ఏది పుష్పా.. 27 ఏళ్ల ఎగిరిన కాషాయజెండా.. పక్కా ప్లాన్‌తో..
ఈ స్టార్ హీరోయిన్‌కు ఏమైంది..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి
ఈ స్టార్ హీరోయిన్‌కు ఏమైంది..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి