Prakash Raj: కుంభమేళాలో ప్రకాష్ రాజ్ పుణ్యస్నానం! ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై కేసు పెట్టిన నటుడు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో మహాకుంభమేళా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కుంభమేళాకు వస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు.

Prakash Raj: కుంభమేళాలో ప్రకాష్ రాజ్ పుణ్యస్నానం! ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై కేసు పెట్టిన నటుడు
Actor Prakash Raj
Follow us
Basha Shek

|

Updated on: Feb 01, 2025 | 12:44 PM

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. గంగమ్మ ఒడిలో స్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలో భాగమవుతున్నారు. అదే సమయంలో మహా కుంభమేళాకు సంబంధించి కొన్ని AI ఫొటోలు, ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇవి నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో వివాదాలకు కూడా కారణమవుతున్నాయి. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పవిత్ర కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరిస్తున్నట్లు ఇటీవల కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. స్వతహాగా నాస్తికుడైన ఆయన కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానం చేస్తున్నట్లు కొన్ని ఫొటోటు వైరల్ కావడంపై నటుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనిది ఉన్నట్లు చూపించడంపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ఈ వ్యవహారంపై ఆయన పోలీసులను ఆశ్రయించాడు. ప్రముఖ సామాజిక వేత్త, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రశాంత్ సంబర్గిపై కేసు పెట్టారు.

సినిమాల్లో బిజీగా ఉంటోన్న ప్రకాష్ రాజ్ రాజకీయ వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నిర్ణయాలను ఆయన తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటుడు కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానం చేస్తున్నట్లు ఏఐ ఫొటో క్రియేట్ చేశారు. చాలామంది దీనిని చూసి నిజమనుకున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ మైసూరులోని లక్ష్మీపురం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి తమ ఫొటోలపై దుష్ప్రచారం చేస్తున్నారని, వీటిని అరికట్టాలని ప్రకాష్‌ రాజ్ తన ఫిర్యాదులో కోరారు.

ఇవి కూడా చదవండి

నేను మనుషులను నమ్ముతాను..

‘మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడంలో తప్పు లేదు. అది వారి నమ్మకం. నాకు దేవుడి మీద నమ్మకం లేదు. నేను మనుషులను నమ్ముతాను. దేవుడు లేకుండా మనం జీవించగలం, కానీ మానవులు లేకుండా మనం జీవించలేం’ అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.

ప్రకాష్ రాజ్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. విలన్‌గా, హీరోగా, సపోర్టింగ్ రోల్స్ తో అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో డజన్ల కొద్దీ సినిమాలున్నాయి.

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బిల్ పేమెంట్ ఫీచర్..!
వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బిల్ పేమెంట్ ఫీచర్..!
ఓటీటీలోకి వచ్చేసిన అప్సర రాణి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన అప్సర రాణి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ..
ఆ రోజు పండగ అంటే చూపిస్తాం అంటున్న డార్లింగ్ అండ్ బన్నీ..
ఆ రోజు పండగ అంటే చూపిస్తాం అంటున్న డార్లింగ్ అండ్ బన్నీ..
పసిడి ధరలకు బ్రేక్.. బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
పసిడి ధరలకు బ్రేక్.. బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
మ్యాచ్ మధ్యలో స్నిన్నర్‌గా మారిన పేస్ బౌలర్.. కట్‌చేస్తే..
మ్యాచ్ మధ్యలో స్నిన్నర్‌గా మారిన పేస్ బౌలర్.. కట్‌చేస్తే..
ఈ చిచ్చర పిడుగులు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరోలు
ఈ చిచ్చర పిడుగులు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరోలు
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు పక్కా.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు పక్కా.. 12 రాశుల వారికి వారఫలాలు
పార్టీ ఏది పుష్పా.. 27 ఏళ్ల ఎగిరిన కాషాయజెండా.. పక్కా ప్లాన్‌తో..
పార్టీ ఏది పుష్పా.. 27 ఏళ్ల ఎగిరిన కాషాయజెండా.. పక్కా ప్లాన్‌తో..
ఈ స్టార్ హీరోయిన్‌కు ఏమైంది..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి
ఈ స్టార్ హీరోయిన్‌కు ఏమైంది..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి
రెడ్ డ్రస్‌లో క్యూట్ పిక్స్ షేర్ చేసిన భాగ్యం..
రెడ్ డ్రస్‌లో క్యూట్ పిక్స్ షేర్ చేసిన భాగ్యం..