IND vs ENG: అర్ధసెంచరీలతో దుమ్ము దులిపిన దూబే, హార్దిక్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
పుణే వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతోన్న నాలుగో టీ20 మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆదిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యాల బాధ్యాయుత బ్యాటింగ్ తో మళ్లీ రేసులోకి వచ్చింది.

పుణె వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతోన్న నాలుగో టీ20 మ్యాచ్ లో భారత ఇన్నింగ్స్ ముగిసింది. శివమ్ దూబె (34 బంతుల్లో 53, 7 ఫోర్లు, 2 సిక్స్ లు), హార్దిక్ పాంండ్యా (30 బంతుల్లో 53, 4 ఫోర్లు, 4 సిక్స్ లు) అర్ధశతకాలతో రాణించడంతో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అంతకు ముందు రింకూసింగ్ (30), ఓపెనర్ అభిషేక్ శర్మ (29) పరుగులతో పర్వాలేదనిపించారు. కెప్టెన్ సూర్యకుమార్ (0) మరోసారి విఫలమయ్యాడు. తిలక్ వర్మ (0), సంజూ శామ్సన్ (1) కూడా వెంట వెంటనే పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో 2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. దీంతో రింకూ సింగ్, అభిషేక్ శర్మలు ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కొన్ని మంచి షాట్స్ ఆడారు. అయితే అభిషేక్ శర్మ 29 పరుగులు, రింకూ సింగ్ 30 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో టీమిండియా 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. పరిస్థితి. అయితే శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్ బౌలర్ల దూకుడును అడ్డుకున్నారు.
హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఇద్దరూ ఆరో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరును సాధించింది. హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిపోయారు. 30 బంతుల్లో 53 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా ఔటయ్యే సమయానికి భారత్ 18 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే 48 బంతుల్లో 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హార్దిక్ ఔటైన తర్వాత శివమ్ దూబే తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
𝗜𝗻𝗻𝗶𝗻𝗴𝘀 𝗕𝗿𝗲𝗮𝗸!#TeamIndia posted 181/9 on the board! 👌 👌
5⃣3⃣ for Hardik Pandya 5⃣3⃣ for Shivam Dube 3⃣0⃣ for Rinku Singh 2⃣9⃣ for Abhishek Sharma
Over to our bowlers now! 👍 👍
Follow The Match ▶️ https://t.co/pUkyQwxOA3#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/83OOqZ2apD
— BCCI (@BCCI) January 31, 2025
భారత్ (ప్లేయింగ్ XI):
సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI):
ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, జామీ ఓవర్‌టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..