Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saqib Mahmood: ఎవరు సామీ నువ్వు ఇలా తగులుకున్నావ్! మొదటి ఓవర్లోనే ఇండియాపై అరుదైన రికార్డు కొట్టేసాడుగా

సాకిబ్ మహమూద్ తన తొలి ఓవర్లోనే సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్‌లను అవుట్ చేసి ట్రిపుల్ వికెట్ మెయిడెన్ నమోదు చేశాడు. ఇంగ్లాండ్ జట్టులో మార్పుగా వచ్చిన మహమూద్ తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత బ్యాటింగ్‌ను కుదిపేశాడు. అతని స్పెల్ కారణంగా భారత టాప్-ఆర్డర్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఈ అద్భుత ప్రదర్శనతో మహమూద్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు.

Saqib Mahmood: ఎవరు సామీ నువ్వు ఇలా తగులుకున్నావ్! మొదటి ఓవర్లోనే ఇండియాపై అరుదైన రికార్డు కొట్టేసాడుగా
Saqib
Follow us
Narsimha

|

Updated on: Jan 31, 2025 | 9:37 PM

ఇంగ్లాండ్ పేసర్ సాకిబ్ మహమూద్ భారత జట్టుపై అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన నాల్గవ T20Iలో తన తొలి ఓవర్లోనే మూడు ప్రధాన వికెట్లు తీయడం ద్వారా భారత జట్టును తన తోలి ఓవర్‌లోనే దెబ్బతీశాడు.

ముగ్గురు ప్రముఖ బ్యాటర్లయిన సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లను ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా అవుట్ చేయడం ద్వారా మహమూద్ “ట్రిపుల్ వికెట్ మెయిడెన్” నమోదు చేశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో T20I లలో ట్రిపుల్ వికెట్ మెయిడెన్ బౌలింగ్ చేసిన తొలి ఇంగ్లీష్ ఆటగాడిగా, అలాగే భారత జట్టుపై సాధించిన తొలి బౌలర్‌గా సాకిబ్ మహమూద్ నిలిచాడు.

భారత బ్యాటింగ్‌ను కుదిపేసిన సాకిబ్ తొలి ఓవర్

సిరీస్‌లో మొదటి టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఓవర్ నుంచే సాకిబ్ మహమూద్ తన వేగంతో భారత బ్యాటింగ్‌ను నాశనం చేశాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌ను ముందుగా తట్టుకున్నప్పటికీ, సాకిబ్ మహమూద్‌ను ఎదుర్కోవడంలో శాంసన్ విఫలమయ్యాడు. బౌలర్‌ను పెద్ద షాట్ ఆడేందుకు ప్రయత్నించి డీప్ స్క్వేర్ లెగ్‌కి క్యాచ్ ఇచ్చాడు. ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మ ధైర్యంగా ముందుకు వచ్చి బంతిని ఆడేందుకు ప్రయత్నించాడు, కానీ స్లైస్ కొట్టి థర్డ్ మ్యాన్ ఫీల్డర్‌కి క్యాచ్ ఇచ్చాడు. దీనితో తన అంతర్జాతీయ కెరీర్‌లో మొదటి గోల్డెన్ డక్‌కి గురయ్యాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒత్తిడిలో ఉండగా, బౌలింగ్‌ను ఆరంభంలో రక్షణాత్మకంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, ఓవర్ చివరి బంతికి నేరుగా మిడ్ ఆన్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

4వ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టులో రెండు మార్పులు చేసింది. మార్క్ వుడ్ స్థానంలో సాకిబ్ మహమూద్ ను, జామీ స్మిత్ స్థానంలో ఆల్‌రౌండర్ జాకబ్ బెథెల్ ను తీసుకుంది. ఇంగ్లాండ్ సాకిబ్ మహమూద్‌ను ఒక మ్యాచ్ విజయాన్ని అందించగల ఆటగాడిగా పరిగణించింది, అతను ఆ అంచనాలను నిలబెట్టాడు.

భారత టాప్-ఆర్డర్‌ను కుదిపేసిన సాకిబ్ మహమూద్ బౌలింగ్ స్పెల్, ఇంగ్లాండ్‌కు ఆటను తమ దిశగా మలచుకునే అవకాశాన్ని ఇచ్చింది. భారత బ్యాటింగ్ ఓవర్లో మూడు ప్రధాన వికెట్లు కోల్పోయి తీవ్రమైన ఒత్తిడిలో పడింది. ఈ ప్రదర్శనతో సాకిబ్ మహమూద్ కేవలం ఇంగ్లాండ్ జట్టుకు మాత్రమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..