Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క ఎపిసోడ్ కోసమే రూ.18 కోట్లు.. ఖర్చులో ఏమాత్రం తగ్గని డైరెక్టర్!

ఒక్క ఎపిసోడ్ కోసమే రూ.18 కోట్లు.. ఖర్చులో ఏమాత్రం తగ్గని డైరెక్టర్!

Phani CH

|

Updated on: Feb 01, 2025 | 1:25 PM

డైరెక్టర్ చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఇందులో యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా నటిస్తుండగా.. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ మరింత హైప్ పెంచాయి. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పుడు యూట్యూబ్ లో సూపర్ హిట్ అయ్యాయి.

శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన వృత్తాంతాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాడు. గత చిత్రం కార్తికేయ 2 అనుభవం తండేల్ సినిమాకు ఎక్కువగా ఉపయోగపడిందని చెప్పిన చందూ మొండేటి.. తానెప్పుడూ అనుకున్న బడ్జెట్ ను దాటి సినిమా చేయనంటూ.. స్టేట్మెంట్ ఇచ్చాడు. తండేల్ సినిమా రీసెర్చ్ అనంతరం కథ రాయడం పూరయ్యిందని.. హీరో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటే బాగుంటుందో టెస్ట్ చేసేందుకు మళ్లీ డి. మత్య్సలేశం వెళ్లి ఇంకా ఏం జరిగింది ? అనే వివరాలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నా అన్నారు మొండేటి. అంతేకాదు ఈ సినిమాలోని ఒక్క ఎపిసోడ్ కోసమే రూ.18 కోట్ల బడ్జెట్ అయ్యిందంటూ ఓ షాకింగ్ విషయాన్ని చెప్పాడు ఈ స్టార్ డైరెక్టర్. సముద్రాన్నే లైవ్ లొకేషన్ గా మార్చి.. మీనియేచర్ పడవలతో ఈ సినిమా కోసం వర్క్ చేశాం. ఆ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయన్నారు డైరెక్టర్ చందు మొండేటి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాపకు ప్రాణం పోసే సాయం !! గొప్ప మనసు చాటుకున్న తేజ్‌

సంగం నోస్‌ ఘాట్‌ వద్దే తొక్కిసలాటకు కారణమేంటి ??

కుంభమేళాలో ఏం జరుగుతోంది ?? యోగీ మాస్టర్ స్కెచ్ ఇదేనా..

సునీతా విలియమ్స్.. ఫిబ్రవరిలోనైనా తిరిగొస్తారా ??

గోల్డ్‌ పెట్టి లోన్‌ తీసుకుంటున్నారా ?? మీ ఒరిజినల్‌ గోల్డ్‌ సేఫేనా ??