పాపకు ప్రాణం పోసే సాయం !! గొప్ప మనసు చాటుకున్న తేజ్
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగులో బిజీగా ఉంటున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ్ బాగా కష్టపడుతున్నాడు. సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేస్తున్నాడు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈ మధ్యన సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడీ మెగా హీరో.
సాయం కోరి వచ్చిన వారికి కూడా కాదనకుండా అండగా నిలుస్తున్నాడు. అలాగే సోషల్ మీడియా ద్వారా సహాయం కోరిన వారికి తన వంతు సాయం చేస్తున్నాడు. ఇటీవల తన కోసం సినిమా సెట్‌కు వచ్చిన ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా భోజనం చేయించి మరీ కడుపు నింపాడు సాయి దుర్గ తేజ్. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడీ మెగా హీరో. కాలేయ సమస్యతో బాధపడుతోన్న ఓ చిన్నారికి తన వంతు సాయం చేశాడు. అలాగే మరికొందరు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించాడు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు సాయి దుర్గ తేజ్. హయా.. అనే అమ్మాయి కాలేయ వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం ఆ పాప జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. తన వంతుగా ఆమె ట్రీట్‌మెంట్ కోసం సాయి ధరమ్ తేజ్ సాయం చేశాడు. అంతేకాదు అందరూ సాయం చేయండంటూ కూడా రిక్వెస్ట్ చేశాడు. ప్రతీ డొనేషన్ చాలా ముఖ్యమైనదని.. ఆమె ఓ పోరాట యోధురాలని.. తప్పకుండా సాయం చేస్తే.. ఆ పాప సమస్య నుంచి బయటపడుతుందని చెప్పాడు. తన మాటలతో.. తన చేతలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ హీరో.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంగం నోస్ ఘాట్ వద్దే తొక్కిసలాటకు కారణమేంటి ??
కుంభమేళాలో ఏం జరుగుతోంది ?? యోగీ మాస్టర్ స్కెచ్ ఇదేనా..
సునీతా విలియమ్స్.. ఫిబ్రవరిలోనైనా తిరిగొస్తారా ??
గోల్డ్ పెట్టి లోన్ తీసుకుంటున్నారా ?? మీ ఒరిజినల్ గోల్డ్ సేఫేనా ??