సునీతా విలియమ్స్.. ఫిబ్రవరిలోనైనా తిరిగొస్తారా ??

సునీతా విలియమ్స్.. ఫిబ్రవరిలోనైనా తిరిగొస్తారా ??

Phani CH

|

Updated on: Jan 31, 2025 | 4:19 PM

2024 జూన్ 5వ తేదీ. బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. అక్కడి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లో 8 రోజుల పాటు గడిపి కీలక పరిశోధనలు చేసి వెనక్కి వచ్చేయాలి. ఇదీ నాసా అసలు మిషన్. ఇందుకోసం ఇద్దరు ఆస్ట్రోనాట్స్‌ని సిద్ధం చేసింది. వాళ్లలో ఒకరు సునీతా విలియమ్స్ కాగా..మరొకరు బచ్ విల్మోర్. ఇద్దరూ సక్సెస్‌ఫుల్‌గానే అక్కడికి వెళ్లారు.

ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో అది సాధించారు. ఇక అంతా సర్దేసుకుని వెనక్కి వచ్చేయడమే అనుకున్నారు. సరిగ్గా అప్పుడే బోయింగ్ స్టార్‌లైనర్‌లో టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. వెంటనే సరైపోతుందిలే అని వెయిట్ చేశారు. వాళ్లు అలా నిరీక్షించబట్టి ఇప్పటికి 8 నెలలవుతోంది. ఇంత వరకూ ఏ మాత్రం పురోగతి లేదు. ఇదిగో వచ్చేస్తారు..అదిగో వచ్చేస్తారు అని ప్రకటనలు తప్ప అవేవీ నిజం కాలేదు. అంటే సుమారు 8 నెలలుగా వాళ్లు అలా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే చిక్కుకుపోయారు. ఆహారం, వైద్యంతో పాటు ఇతరత్రా సాయాలు అందుతూనే ఉన్నాయి. కానీ..వాళ్లు వెనక్కి వచ్చే మార్గమే తోచకుండా ఉంది. అయితే…అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఈ బోయింగ్ స్టార్‌లైనర్‌ని వెనక్కి తీసుకు రావాలని ఎలన్ మస్క్‌ని రిక్వెస్ట్ చేశారు. అప్పటి నుంచి మరోసారి స్టార్‌లైనర్‌పై డిబేట్ మొదలైంది. ఇప్పుడంతా ఆలోచించేదేంటంటే..అసలు వీళ్లను వెనక్కి తీసుకురావడం ఎలా అని. అయితే ట్రంప్..మస్క్‌ని రిక్వెస్ట్ చేసిన తరవాత నాసా స్పందించింది. స్పేస్‌ ఎక్స్‌తో కలిసి వీలైనంత త్వరగా వాళ్లని భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు క్లియర్‌గా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా Crew-10 ని లాంఛ్ చేసేందుకూ సిద్ధమవుతున్నట్టు వెల్లడించింది. నిజానికి ఫిబ్రవరి నాటికే సునీతా విలియమ్స్‌, బచ్ విల్మోర్ భూమిపైకి వచ్చేస్తారని ముందుగా ప్రకటించారు. కానీ..నాసా అఫీషియల్‌గా ఇచ్చిన స్టేట్‌మెంట్ మాత్రం వేరుగా ఉంది. బహుశా వాళ్లను వెనక్కి తీసుకురావడానికి ఇంకాస్త సమయం పడుతుండొచ్చని, మార్చి నెలలో ఇది జరిగే అవకాశముందని ప్రకటించింది. అసలు ఎందుకింత ఆలస్యం అవుతోందో కూడా నాసా వివరిస్తోంది. బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భద్రతా ప్రమాణాల్లో తలెత్తిన లోపాల వల్లే ఇలా జరుగుతోందని వెల్లడించింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ని..స్పేస్ స్టేషన్‌కి ఆస్ట్రోనాట్స్‌ని పంపించేందుకు ప్రత్యేకంగా తయారు చేశారు. అయితే..తీరా స్పేస్‌లోకి వెళ్లాక అక్కడ టెక్నికల్ సమస్యలు వచ్చాయి. ఫలితంగా అక్కడే వ్యోమగాములు చిక్కుకుపోయారు. మరి ఇన్ని రోజులు అక్కడే ఉంటే..ఆస్ట్రోనాట్స్‌కి ఏమీ కాదా..? వాళ్ల ఆరోగ్య పరిస్థితేంటి..?

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గోల్డ్‌ పెట్టి లోన్‌ తీసుకుంటున్నారా ?? మీ ఒరిజినల్‌ గోల్డ్‌ సేఫేనా ??

15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాడు.. చివరకు ఇలా అయ్యాడు!

మీ ఊరిలో కరెంటు పోతే.. వెంటనే ఈ నెంబర్‌కు కాల్‌ చేయిండి