Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాడు.. చివరకు ఇలా అయ్యాడు!

15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాడు.. చివరకు ఇలా అయ్యాడు!

Phani CH

|

Updated on: Jan 31, 2025 | 4:16 PM

కేవలం వారం రోజుల్లో 10 కేజీల బరువు తగ్గిన ఓ యువ జిమ్ ట్రెయినర్ చివరకు తాత్కాలిక పక్షవాతానికి గురయ్యాడు. కుడికాలు కదపలేని స్థితికి చేరుకున్నాడు. అయితే, సమస్య మొదలైన వెంటనే వైద్యులను సంప్రదించడంతో అనారోగ్యం నుంచి సులువుగా బయటపడగలిగారు. వెంటనే బాధితుడిని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించగా అతడు స్లిమ్మర్స్ పెరాలిసిస్ బారిన పడ్డట్టు గుర్తించారు.

నిపుణులు చెప్పే దాని ప్రకారం, అకస్మాత్తుగా బరువు తగ్గిన సందర్భాల్లో అరికాళ్లల్లో ఉండే కొవ్వు పొర తగ్గిపోతుంది. ఫలితంగా, కాలి కదలికలు, స్పర్శకు కారణమయ్యే నాడీ కణాలపై ఒత్తిడి పెరుగుతుంది. చివరకు కాల్లో స్పర్శ తగ్గి, కదపలేని స్థితి వస్తుంది. బరువు తగ్గేందుకు జిమ్‌లో అధికంగా కసరత్తు చేసేవారు ఈ సమస్య బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. ఇది చాలా అసాధారణమైన కేసు అనీ అతిగా కసరత్తులు చేస్తే భుజం ఎముకలు స్థాన భ్రంశం చెందుతాయనీ అన్నారు. వెన్ను, మెడ నొప్పి కూడా వస్తుందనీ ఒక్కోసారి తుంటె ఎముకలు కూడా బలహీనపడతాయన్నారు. అయితే, కసరత్తుల విషయంలో మరీ హద్దు మీరితే ఇలాంటి పరిస్థితి వస్తుందని ప్రముఖ వైద్యుడొకరు తెలిపారు. ఈ ఉదంతంలో బాధితుడు కేవలం రెండు వారాల్లోనే తన బరువులో ఏకంగా 13 శాతం కోల్పోయాడు. ఆ తరువాతే కాలికి సమస్య మొదలైంది. వైద్య పరీక్షల్లో ఇతర సమస్యలేవీ కనిపించకపోవడంతో అకస్మాత్తుగా బరువు తగ్గడమే ఈ పరిస్థితికి కారణమని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. వైద్య పరిభాషలో దీన్ని పెరోనియల్ న్యూరోపతీ అని అంటారు. ఈ పరిస్థితి తలెత్తినప్పుడు కాళ్లు కదపలేని స్థితి వస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ ఊరిలో కరెంటు పోతే.. వెంటనే ఈ నెంబర్‌కు కాల్‌ చేయిండి