జాలర్లకు చిక్కిన అరుదైన చేపలు.. తిన్నారో రోగాలు వద్దన్నా వస్తాయ్ వీడియో
క్యాట్ ఫిష్ పేరు సాధారణంగా అందరూ వినే ఉంటారు. ఇది చేపలలో ఓ రకం చేప. చేపలు తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని, చేప మాంసంలో ఎక్కువ పోషకాలు ఉంటాయని చెబుతుంటారు. వాస్తవంగా మిగతా మాంసాహారాలతో పోల్చుకుంటే చేప మాంసంలోనే ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. కానీ క్యాట్ ఫిష్ మాంసంలో మాత్రం మనిషికి హాని కలిగించే విషరసాయనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ చేపను పెంచడం కానీ, వాటి మాంసాన్ని విక్రయించడం కూడా నిషేధించారు.
అయితే తాజాగా కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో వరదల సమయంలో మురుగునీరు కాలువల ద్వారా కొల్లేరులోకి ఇవి వచ్చి చేరాయి. చేపలు పట్టుకునే సమయంలో మత్స్యకారుల వలకు క్యాట్ ఫిష్‌లు సైతం చిక్కుతున్నాయి. అయితే ఇదే మాదిరిగా దెయ్యం చేపలు కూడా మత్స్యకారుల వలకు చిక్కి అపార నష్టాన్ని చేకూర్చడంతో వాటిని పట్టి.. చెరువుగట్లపై వదిలి వేస్తున్నారు. కానీ క్యాట్ ఫిష్‌లను అలా కాకుండా ముక్కలుగా కోసి కొన్ని చెరువులలో చేపలకు ఆహారంగా ఉపయోగిస్తున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. మరికొందరు అయితే వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మేస్తున్నారు. క్యాట్ ఫిష్ చేప కొరమేను చేపను పోలి ఉంటుంది. క్యాట్ ఫిష్‌కు ఉన్న మీసాలు తీసేసి కొంతమంది దళారులు వాటి గురించి తెలియని వారికి కొరమేను రూపంలో విక్రయిస్తున్నారు. అంతేకాక కొన్ని హోటల్స్ సైతం క్యాట్ ఫిష్ చేపలను తక్కువ ధరలకు కొని.. కస్టమర్లకు చేప మాంసం కింద అమ్మేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం :
మరో భార్యాబాధితుడి ఆత్మ*హ*త్య.. ఎక్కడంటే? వీడియో
పౌరసత్వం వారికే సొంతం..అందరికీ కాదు!
తిరుమల భక్తులకు అలర్ట్.. కొండపై మళ్లీ చిరుత సంచారం..!