వీర్యం, అండం అంతా కృత్రిమమే.. మీకు నచ్చినట్టుగా పిల్లలను డిజైన్ చేయచ్చు! వీడియో

వీర్యం, అండం అంతా కృత్రిమమే.. మీకు నచ్చినట్టుగా పిల్లలను డిజైన్ చేయచ్చు! వీడియో

Ashok Bheemanapalli

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 01, 2025 | 9:53 PM

స్త్రీ లేకపోతే జననం లేదు.. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. చివరకు భగవంతుడైనా తల్లి కడుపునుంచే పుడతారంటారు. కానీ ఇకపై తల్లి గర్భం అవసరం లేకుండానే శిశువును ఉత్పత్తి చేస్తామంటోంది సైన్స్. ఎన్నో వింతలు, అద్భుతాలను సృష్టిస్తున్న సైన్స్.. ప్రతి సృష్టికి రెడీ అవుతోంది. ఫ్యాక్టరీలో వస్తువులు తయారు చేసినట్టు.. ల్యాబ్‌లోనే పిల్లల్ని పుట్టిస్తామంటున్నారు సైంటిస్టులు.

నవమాసాలు మోయాల్సిన పనిలేదు.. పురిటినొప్పులు ఉండవు. అసలు శృంగారంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండానే సంతానాన్ని పొందే రోజులు త్వరలో రాబోతున్నాయంటున్నారు. దీంతో స్వలింగ సంపర్కులు కూడా సంతాన భాగ్యాన్ని పొందేందుకు వీలవుతుంది. ఈ అసాధ్యం వచ్చే పదేండ్లలోగా సుసాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానవ వీర్యాన్ని, అండాలను ప్రయోగశాలలో వృద్ధి చేసే ప్రక్రియకు శాస్త్రవేత్తలు ఇప్పటికే చేరువైనట్టు మానవ ఫలదీకరణ, పిండోత్పత్తి శాస్త్ర బోర్డు గత వారం నిర్వహించిన సమావేశంలో ప్రకటించింది. మానవ ఫలదీకరణ, పిండ శాస్త్రానికి సంబంధించిన చట్టాన్ని ఆధునీకరించేందుకు 2023లో కొన్ని ప్రతిపాదనలు చేసింది హెచ్‌ఎఫ్‌ఈఏ బోర్డు.

మరిన్ని వీడియోస్ కోసం :

జాలర్లకు చిక్కిన అరుదైన చేపలు.. తిన్నారో రోగాలు వద్దన్నా వస్తాయ్ వీడియో 

దిగంబర రూపం.. దేహమంతా విభూతి ఎవరు వీరు? ఎక్కడ ఉంటారు? వీడియో

Published on: Feb 01, 2025 12:43 PM