గోల్డ్‌ పెట్టి లోన్‌ తీసుకుంటున్నారా ?? మీ ఒరిజినల్‌ గోల్డ్‌ సేఫేనా ??

గోల్డ్‌ పెట్టి లోన్‌ తీసుకుంటున్నారా ?? మీ ఒరిజినల్‌ గోల్డ్‌ సేఫేనా ??

Phani CH

|

Updated on: Jan 31, 2025 | 4:17 PM

ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితిలోనో, పెద్దమొత్తంలో డబ్బు అవసరమైనప్పుడో బంగారం తాకట్టు పెట్టి తెచ్చుకుంటుంటారు చాలామంది. ఇటీవల గోల్డ్‌ లోన్స్‌ ఇచ్చే సంస్థలు కూడా బాగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా బంగారంపై రుణాలు…అంటూ బోర్డులు కనిపిస్తున్నాయి. వాటిని చూసి ఎలాంటి వెరిఫై చేయకుండా నగలు తాకట్టు పెడితే జరిగేది మోసమే.

చిత్తూరు, అనంతపురం జిల్లాలోని కనకదుర్గ గోల్డ్‌ ఫైనాన్స్‌ లో అదే జరిగింది. ఆఫీసులో దొంగలు పడలేదు… కానీ నకిలీ బంగారంలో బడా గోల్‌మాల్‌కు తెరలేపిన ఇంటి దొంగల వ్యవహారం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఏపీగా మారింది. చిత్తూరు జిల్లా పుంగనూరు, పలమనేరులో కనకదుర్గా గోల్డ్‌ లోన్స్‌ సంస్థకు ఉద్యోగులే పంగనామాలు పెట్టారు. తమ బంధువుల, స్నేహితుల ద్వారా నకిలీ బంగారం తనఖా పెట్టించి ఎడాపెడా లోన్లు ఇచ్చేశారు. చెక్‌ చేస్తే ఆడిట్‌లో 8 కోట్ల స్కామ్‌ బయటపడింది. సిబ్బంది సహా 26 మందిపై కేసు ఫైల్‌ చేశారు పోలీసులు. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండలోని కనకదుర్గ గోల్డ్‌ ఫైనాన్స్‌లోనూ సేమ్‌ టు సేమ్‌ స్కామ్‌ తెరపైకి వచ్చింది. కంపెనీ మేనేజర్, సిబ్బంది కుమ్మకై నకిలీ బంగారం తాకట్టు పెట్టి 56 లక్షల నగదు నొక్కేశారు. కంపెనీ ఆడిట్‌లో అసలు విషయం బయటపడింది. కనక దుర్గ గోల్డ్‌ ఫైనాన్స్‌ ప్రతినిధుల ఫిర్యాదుతో బ్రాంచ్ మేనేజర్‌ ప్రశాంత్ కుమార్ , అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఆడిటర్‌ రామాంజనేయులు, మేనేజర్లు జ్వాలా చంద్రశేఖర్‌ రెడ్డి, గురునాథ్‌ రెడ్డిలపై కేసు ఫైల్‌ చేశారు ఉరవకొండ పోలీసులు. ఆడిట్‌లో అసలు బాగోతం బయటపడినా…ఎలాగోలా నకిలీ బంగారం ప్లేస్‌లో ఒరిజనల్‌ గోల్డ్‌ నగలు పెట్టి కవర్ చేయాలని ట్రై చేశారట. కానీ పుంగనూరు, పలమనేరులోని కనకదుర్గ గోల్డ్‌ ఫైనాన్స్‌లో 8 కోట్ల స్కామ్‌ బయటపడ్డంతో చివరాఖరకు పోలీసులను ఆశ్రయించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాడు.. చివరకు ఇలా అయ్యాడు!

మీ ఊరిలో కరెంటు పోతే.. వెంటనే ఈ నెంబర్‌కు కాల్‌ చేయిండి