బడ్జెట్ తరువాత బంగారం ధర పెరుగుతుందా ?? తగ్గుతుందా ??

బడ్జెట్ తరువాత బంగారం ధర పెరుగుతుందా ?? తగ్గుతుందా ??

Phani CH

|

Updated on: Jan 31, 2025 | 9:21 PM

అంతర్జాతీయంగా ట్రంఫ్‌ ఎఫెక్ట్‌.. దేశీయంగా రూపీ పతనంతో కొత్త రికార్డులను తాకుతోంది..గోల్డ్‌ రేట్‌. తాజాగా పదిగ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 84 వేల రూపాయలు దాటింది.. అటు వెండి కూడా తగ్గేదేలేదంటూ బంగారంతో పోటీ పడుతోంది..ప్రస్తుతం కిలో వెండి ధర 95 వేల 400 దగ్గర ట్రేడ్ అవుతోంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లలో మార్పు చేయలేదు.

దీంతో ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 40 డాలర్లకు పైగా పెరిగింది. ఇటు దేశీయంగా డాలర్‌ విలువ 86 రూపాయల 62 పైసలకు చేరింది. దీంతో భారత్‌లో పసిడి ధరలు మరింత భగ్గుమంటున్నాయి. కిలో వెండి ధర కూడా అంతర్జాతీయ విపణిలో 26 డాలర్లకు పైగా పెరిగి..1,014 డాలర్లకు చేరింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన నాటినుండి భయంభయంగానే ఉంది స్టాక్‌మార్కెట్‌ పరిస్థితి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న భయంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు మదుపర్లు. ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతుందనే భయాందోళనలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక భరోసా కోసం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పసిడిపైకి మళ్లిస్తున్నారు. మరోవైపు బంగారం ధరలు కట్టడి చేసేందుకు బడ్జెట్‌లో నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు పసిడి ప్రియులు. గతేడాది జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. దీంతో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా దిగి వచ్చాయి. మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వచ్చేసింది. ఈ క్రమంలో మరోసారి సుంకాలు తగ్గించి బంగారం ధరల పెరుగుదలను కట్టడి చేయాలని ఆశిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లోకి చొరబడి.. స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి! హీరోకు షాకిచ్చిన ఆగంతకుడు

విషాదంలో రాణా !! కన్నీళ్లతో పాడె మోసిన హీరో

పద్మ అవార్డ్‌ ఏమో కానీ.. ఈ స్టార్స్ మధ్య గొడవ షురూ

పాపకు ప్రాణం పోసే సాయం !! గొప్ప మనసు చాటుకున్న తేజ్‌

సంగం నోస్‌ ఘాట్‌ వద్దే తొక్కిసలాటకు కారణమేంటి ??