పద్మ అవార్డ్‌ ఏమో కానీ.. ఈ స్టార్స్ మధ్య గొడవ షురూ

పద్మ అవార్డ్‌ ఏమో కానీ.. ఈ స్టార్స్ మధ్య గొడవ షురూ

Phani CH

|

Updated on: Jan 31, 2025 | 7:47 PM

కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 7 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీలను ప్రకటించారు. అందులో బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్‌ను కూడా పద్మశ్రీ అవార్డ్ వరించింది. అయితే ఈ స్టార్ సింగర్‌కు అవార్డ్‌ రావడంపై మరో స్టార్ సింగర్ సోనూ సిగమ్‌ ఇన్‌డైరెక్ట్‌ గా విమర్శలు చేశాడు.

ఎంతో మంది స్టార్ సింగర్స్‌ ఉన్నా .. అర్జిత్ సింగ్‌కు ఈ అవార్డ్ రావడం ఏంటన్నట్టు ఓ పోస్ట్ పెట్టాడు. ఇంతకీ సోనూ నిగమ్ ఏం చేశారంటే.. అర్జిత్ సింగ్‌కు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన తర్వాత… పద్మ అవార్డులు అందుకోని భారతీయ గాయకుల జాబితాను ఓ వీడియోలో పొందు పరిచి ఆ వీడియోను షేర్ చేశాడు సోనూ నిగమ్. ఇలాంటి గొప్ప గాయకులకు, సీనియర్ గాయకులకు పద్మ అవార్డ్‌ రాకపోవడం పై తన అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాదు… ఏ రంగంలో అయినా సరే… అది గానం, నటన, క్రీడలు, సైన్స్, సాహిత్యం కావచ్చు. అర్హులకు గౌరవం లభించాలంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. గాయకులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. అభిప్రాయపడ్డాడు. అర్జిత్ సింగ్ చాలా మంచి గాయకుడు, అతను వేలాది మందికి స్ఫూర్తినిచ్చాడు, కానీ అతని కంటే సీనియర్లు, ప్రతిభావంతులైన గాయకులు చాలా మంది ఉన్నప్పుడు వారందర్నీ నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటు అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు సోనూ నిగమ్. అయితే నిగమ్‌ షేర్ చేసిన వీడియో కారణంగా.. సోషల్ మీడియాలో అర్జిత్ ఫ్యాన్స్‌ వర్సెస్ సోనూ నిగమ్ ఫ్యాన్స్‌ అన్నట్టుగా పరిస్థితి మారింది. పద్మ అవార్డ్‌ ఏమో కానీ.. గొడవ షురూ అయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాపకు ప్రాణం పోసే సాయం !! గొప్ప మనసు చాటుకున్న తేజ్‌

సంగం నోస్‌ ఘాట్‌ వద్దే తొక్కిసలాటకు కారణమేంటి ??

కుంభమేళాలో ఏం జరుగుతోంది ?? యోగీ మాస్టర్ స్కెచ్ ఇదేనా..

సునీతా విలియమ్స్.. ఫిబ్రవరిలోనైనా తిరిగొస్తారా ??

గోల్డ్‌ పెట్టి లోన్‌ తీసుకుంటున్నారా ?? మీ ఒరిజినల్‌ గోల్డ్‌ సేఫేనా ??