బాలయ్య, చిరుకు ‘పద్మ’ అవార్డులు ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే…?
నందమూరి నటసింహం బాలకృష్ణకు కేంద్రం రీసెంట్గా పద్మ పురస్కారం ప్రకటించింది. 30 ఏళ్లుగా కళారంగం, సమాజానికి ఆయన చేసిన సేవలకుగాను బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. కాగా, తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి కూడా కేంద్రం గతేడాది పద్మ విభూషణ్ ప్రకటించింది. అయితే ఈ ఇద్దరికి పద్మ అవార్డులు దక్కడంలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే?
బాలకృష్ణ రీసెంట్గా ‘డాకు మహారాజ్’ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 12న రిలీజై భారీ విజయం దక్కించుకుంది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 160+ కోట్లకుపైగా గ్రాస్ వసూల్ చేసింది. అయితే గతేడాది చిరంజీవికి కూడా ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా సక్సెస్ తర్వాతే ఆయనకు పద్మ అవార్డ్ దక్కింది. 2023 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాకు కూడా బాబీనే దర్శకుడు కావడం ఇక్కడ మరో విశేషం. అలా ఈ ఇద్దరు టాలీవుడ్ బిగ్ స్టార్లు డైరెక్టర్ బాబీ సినిమా తర్వాత అత్యుత్తమ పురస్కారాలు దక్కించుకున్నారంటూ నెట్టింట్ వైరల్ చేస్తున్నారు ఈ హీరోలు, డైరెక్టర్ అభిమానులు.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
