నాలుగేళ్లు సక్సెస్ లేదు.. ఆ ఒక్క సినిమాతో స్టారయ్యాడు..
సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో సూర్య ఒకరు. వన్ ఆఫ్ ది ట్యాలెంటెడ్ అండ్ ఫ్యాన్ బేస్ హీరోగా ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో ట్యాగ్ వచ్చేలా చేసుకున్నాడు. అలాంటి ఈ హీరో కోలీవుడ్ స్టార్ హీరో శివకుమార్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ సక్సెస్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన 4 ఏళ్ల వరకు సక్సెస్ లేక తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యాడు.
కానీ కట్ చేస్తే ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో తన కంటూ ఓ పేజ్‌నే క్రియేట్ చేసుకున్నాడు. ఇక సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. కానీ అతడి పేరును డైరెక్టర్ మణిరత్నం సూర్యగా మార్చారు. సూర్య తన తొలినాళ్లలో నటనపై ఆసక్తి చూపలేదు. దానికి బదులు తన చిన్నతనం నుంచే దర్శకుడు కావాలని కలలు కన్నాడు. ఆ క్రమంలోనే తన చదువు పూర్తయ్యాక అనుకోని పరిస్థితుల్లో..యాక్టర్‌గా హీరోగా..మారాడు. 1997లో వసంత్ దర్శకత్వం వహించిన ‘నెరుకు నేర్’తో సూర్య సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేపోయింది. అలా వరుసగా 4 సంవత్సరాలు పెద్ద హిట్ ఇవ్వలేకపోయాడు సూర్య. ఈ క్రమంలోనే 2001లో విడుదలైన ‘నంద’ సినిమాతో సూర్య తన మొదటి హిట్ కొట్టాడు. ఆ సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2003లో వచ్చిన కాకా కాకా చిత్రంలో సూర్య పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. దీనికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆయన నటించిన గజిని, సింగం లాంటి ఎన్నో సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ అయ్యాయి. సూర్యకు తిరుగులేని మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత సూర్య నటించిన సురారై పోట్రు సినిమా పాన్ ఇండియా లెవల్లో హిట్ అవ్వడంతో.. సూర్య గ్రాఫ్ మరింతగా పెరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క ఎపిసోడ్ కోసమే రూ.18 కోట్లు.. ఖర్చులో ఏమాత్రం తగ్గని డైరెక్టర్!