Saif Ali Khan: సైఫ్‌పై కోర్టుకెక్కుతా.. అంతా కోల్పోయా
సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో రోజుకో కొత్త అప్‌డేట్‌లు వస్తున్నాయి. అరెస్టయిన దుండగుడితో పాటు కేసును క్షుణ్ణంగా విచారిస్తున్నారు. అయితే తరచుగా వినిపిస్తున్న మరో పేరు ఆకాష్ కనోజియా. సైఫ్ దాడి కేసులో అనుమానితుడిగా అరెస్టు చేసినందుకు అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. దీంతో ఇప్పుడు అతడు సైఫ్ పై కోర్టుకెక్కుతానంటూ చెబుతున్నాడు.
తన మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఇక సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో.. సీసీటీవీలో కనిపించిన దుండగుడి ముఖం ఆకాశ్ ముఖంలా ఉండడంతో ఛత్తీస్‌గఢ్ పోలీసులు నేరుగా ఆకాష్‌ను దాడికి పాల్పడినట్లు అనుమానించారు. దీంతో అతడే అసలు నిందితుడని అందరూ అనుకున్నారు. కానీ అసలు నిందితుడిని గుర్తించిన మూడు రోజుల తర్వాత ఆకాష్‌ని విడుదల చేశారు. అయితే తనను అరెస్ట్ చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నా అంటున్నాడు ఆకాష్. ఈ కేసులో తన పేరు పొరపాటుగా రావడంతో ఉద్యోగం పోయిందని.. వివాహం ఆగిపోయిదని చెబుతున్నాడు. పోలీసుల పొరపాటు తనతో పాటు తన కుటుంబంపైనా తీవ్ర ప్రభావం చూపిందంటూ అసహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల టీవీ9తో మాట్లాడాడు. తాను ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ స్టేషన్‌లో రైలులో కూర్చున్నప్పుడు, రైల్వే పోలీసులు తన వద్దకు వచ్చి తన ఫోటోను చూపించి..రైలు నుంచి దించారని చెప్పాడు. దాడి చేసింది తానేనని ఒప్పుకోవాలంటూ కొందరు ముంబై పోలీసులు తన పై ఝులుం చేశారంటూ చెప్పాడు. సైఫ్ పై దాడి తర్వాత ముంబై పోలీసులు తనను ఉదయం 10:30 గంటలకు తీసుకెళ్లారని.. రాత్రి 9:30 గంటలకు విచారణ చేసి.. మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు పొరపాటున పట్టుకున్నాం.. వెళ్లిపో అంటూ చెప్పాడన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాలుగేళ్లు సక్సెస్ లేదు.. ఆ ఒక్క సినిమాతో స్టారయ్యాడు..
ఒక్క ఎపిసోడ్ కోసమే రూ.18 కోట్లు.. ఖర్చులో ఏమాత్రం తగ్గని డైరెక్టర్!