సైఫ్ అలీఖాన్
సైఫ్ అలీఖాన్.. హిందీ చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయకుడు. అలాగే నిర్మాత సైతం. 1970 ఆగస్టు 16న ఢిల్లీలో జన్మించాడు. మాజీ టీమిండియా క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడి, హిందీ నటి షర్మిలా టాగోర్ దంపతుల కుమారుడు. అతడి పూర్వీకులు పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు. సైఫ్ ముత్తాత ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ, తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడీలు ఇద్దరూ నవాబులే. 1993లో ఖాన్ పరంపర సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత యే దిల్లాగి, మెయిన్ ఖిలాడి తూ అనారీ , కచ్చే ధాగే వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకుని స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. 1991లో హీరోయిన్ అమృతా సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ జన్మించారు. కానీ వీరిద్దరు 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న సైఫ్.. 2012లో హీరోయిన్ కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.