సైఫ్ ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌కి.. హీరో ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే? వీడియో
బాలీవుడ్ సైఫ్ అలీఖాన్ ప్రాణాలను కాపాడిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాకు పంజాబీ గాయకుడు మికా సింగ్ రూ. 1 లక్ష రివార్డు ప్రకటించారు. జనవరి 16న తన బాంద్రా ఇంటిలో దాడికి గురైన తర్వాత తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న సైఫ్‌ను రానా తన ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పంజాబీ గాయకుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆటో డ్రైవర్‌ను ప్రశంసిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అతనికి రూ. 1 లక్ష నజరానా ప్రకటించారు. "భారత్‌కు ఇష్టమైన సూపర్‌స్టార్‌ను కాపాడినందుకు అతను కనీసం రూ. 11 లక్షల రివార్డుకు అర్హుడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అతని వీరోచిత చర్య నిజంగా అభినందనీయం. వీలైతే దయచేసి అతని కాంటాక్ట్ నంబర్ చెప్పండి. నా తరఫున అతనికి రూ. 1 లక్ష బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను" అని మికా సింగ్ తన పోస్టులో రాసుకొచ్చారు.
కాగా, సైఫ్ తను డిశ్చార్జ్ అయ్యే ముందు ఆటో డ్రైవర్‌ను ఆసుపత్రిలో కలిశారు. రానాను కౌగిలించుకుని ధన్యవాదాలు తెలిపాడు. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ కూడా రానాను ఆశీర్వదించారు. అలాగే అతనికి సైఫ్ రూ.50వేలు ఇచ్చినట్లు సమాచారం. ఇక జనవరి 16న తన బాంద్రాలోని సద్గురు శరణ్ ఇంటిలో చోరీకి ప్రయత్నించిన సమయంలో సైఫ్ అలీఖాన్‌ను ఒక ఆగంతుకుడు ఆరుసార్లు కత్తితో పొడిచిన విషయం తెలిసిందే. దాడి తర్వాత ఆయన తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆటోలో లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు సైఫ్‌కు సర్జరీ చేశారు. ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన డిశ్చార్జ్ అయ్యారు. కాగా, పోలీసులు జనవరి 19న ముంబయిలోని థానేలో ఈ దాడికి పాల్పడిన బంగ్లాదేశ్ వాసి మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ని అరెస్టు చేశారు. త్వరలోనే నిందితుడుని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది.
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

