AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan: ‘సినిమాకు 21 కోట్లు.. కనీసం వాచ్ మెన్‌ను పెట్టుకోలేరా’? కరీనాపై ప్రముఖ దర్శకుడి విమర్శలు

సైఫ్ అలీ ఖాన్ పై దాడిపై ప్రముఖ నటుడు, దర్శకుడు స్పందించారు. ముఖ్యంగా కరీనా కపూర్ పై విమర్శలు గుప్పించారు. కోట్లాది రూపాయల పారితోషం తీసుకునే కరీనా దగ్గర చాలా డబ్బు ఉన్నప్పటికీ సరైన సెక్యూరిటీ గార్డులు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ సంఘటన సినీ తారల భద్రతపై అనుమానాలు రేకెత్తించిందన్నారు.

Saif Ali Khan: 'సినిమాకు 21 కోట్లు.. కనీసం వాచ్ మెన్‌ను పెట్టుకోలేరా'? కరీనాపై ప్రముఖ దర్శకుడి విమర్శలు
Saif Ali Khan Stabbing Case
Basha Shek
|

Updated on: Feb 04, 2025 | 10:41 AM

Share

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి బాలీవుడ్ లో కలకలం రేపింది. ఈ ఘటనతో ముంబై లాంటి మహా నగరంలో సెలబ్రిటీల భద్రతపై సందేహాలు, అనుమానాలు తలెత్తాయి. ముఖ్యంగా దాడి సమయంలో సైఫ్- కరీనాల ఇంట్లో సెక్యూరిటీ గార్డులు లేరా? అని చాలామంది ప్రశ్నలు లేవనెత్తారు. ఇదిలా ఉండగా, ప్రముఖ నటుడు, దర్శకుడు ఆకాశ్‌దీప్ సబీర్‌, అతని భార్య షీబా ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో సైఫ్ సతీమణి, నటి కరీనా కపూర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇంటిని భద్రంగా ఉంచుకోవడానికి కరీనా వద్ద డబ్బుల్లేవా’ అంటూ సూటిగా ప్రశ్నించారు. ‘కరీనా కపూర్ ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయలు తీసుకుంటోంది. అయితే ఆమె కనీసం ఇంటి బయట వాచ్ మెన్ ను పెట్టుకోలేకపోతున్నారు. అలాగే సైఫ్ పై దాడి జరిగినప్పుడు అక్కడ కారు డ్రైవర్లు ఎవరూ లేరు. అందువలన అతను ఆటోలో ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది. ఒకవేళ వాళ్లకు రూ.100 కోట్లు రెమ్యూ నరేషన్‌ ఇస్తే వాళ్లు సెక్యూరిటీ, డ్రైవర్‌ను పెట్టుకుంటారేమో’ అని సైటెరికల్ కామెంట్స్ చేశారు ఆకాశ్ దీప్.

‘నేను కరీనాను కలిసినప్పుడు, ఆమె ఇంకా చిన్నది. సైఫ్, కరీనా పెళ్లి చేసుకున్నప్పుడు, నేను ఒక టీవీ చర్చలో కూర్చుని వారి తరపున మాట్లాడాను. కరిష్మా కపూర్ మొదటి సినిమా ‘సహారా’ నేనే నిర్మించి, దర్శకత్వం వహించాను. అప్పుడు కరీనా నటి కాదు ఆమె ఇంకా చిన్నపిల్ల’. కరీనా ఇంట్లో సెక్యూరిటీ గార్డు ఎందుకు లేడనేది నా ప్రశ్నజ ఒక ఇంట్లో 30 సీసీటీవీలు ఉండవచ్చు. కానీ, వారు దొంగను అడ్డుకుంటారా లేదా ఆపుతారా? సీసీటీవీ నేరాన్ని గుర్తించడంలో మాత్రమే సహాయపడుతుంది, కానీ అది జరగకుండా అడ్డుకోదు. కరీనా దంపతులు తమతో పాటు ఫుల్ టైమ్ డ్రైవర్‌ను ఎందుకు నియమించుకోలేదు’ అని ప్రశ్నించారు ఆకాశ్ దీప్.

కాగా జనవరి 16న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. దొంగతనానికి వచ్చిన ఓ దుండుగుడు నటుడిపై విచక్షణా రహితంగా  కత్తితో దాడి చేశాడు. దీంతో సైఫ్ శరీరంపై చాలా చోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు సైఫ్ ను సమీపంలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులు చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్నాడు సైఫ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి