AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పట్లో సన్నగా.. హ్యాండ్సమ్‌గా.. ఇప్పుడేమో ఇలా.. ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా?

ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. చేసింది తక్కువ చిత్రాలైనా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలతో యూత్‌లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే వరుసగా పరాజయాలు పలకరించడంతో ఫేడ్ వుట్ అయిపోయాడు.

Tollywood: అప్పట్లో సన్నగా.. హ్యాండ్సమ్‌గా.. ఇప్పుడేమో ఇలా.. ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Feb 03, 2025 | 11:43 AM

Share

సినీ తారల క్రికెట్ లీగ్ సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్)కు సంబంధించి ఆదివారం (ఫిబ్రవరి 02) హైదరాబాద్ లో ఓ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు. టాలీవుడ్‌ సినీ తారలకు చెందిన తెలుగు వారియర్స్‌ టీమ్‌ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీమ్ కెప్టెన్ అఖిల్ అక్కినేని తో పాటు తమన్ , అశ్విన్, రఘు, సామ్రాట్ తదితర టాలీవుడ్ నటులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అదే సమయంలో తెలుగు వారియర్స్ టీమ్ యజమాని కూడా హాజరయ్యాడు. ఆటగాళ్లతో కలిసి కెమెరాలకు పోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అన్నట్లు తెలుగు వారియర్స్ టీమ్ యజమాని మరెవరో కాదు గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన సచిన్ జోషి. సినిమాల్లో నటించేటప్పుడు సన్నగా, హ్యాండ్సమ్ గా కనిపించిన అతను ఇప్పుడు బొద్దుగా గుర్తు పట్టలేకుండా మారిపోయాడు.

2002లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాు సచిన్ జోషి. మౌనమేలనోయి సినిమాతో మొదటి సినిమాతోనే మంచి మ్యూజికల్ హిట్ కొట్టాడు.ఆ తర్వాత నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, నీ జతగా నేనుండాలి వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ లో నటించాడు. అయితే హీరోగా పెద్దగా క్లిక్ కాలేకపోయాడు. హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించినా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో నిర్మాతగా మారాడు. 2018లో రిలీజైన సందీప్ కిషన్ నెక్ట్స్ ఏంటి సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. . కొన్ని సినిమాలకి ఫైనాన్స్ కూడా అందించాడు. ఇక చివరిగా 2019లో ఓ హిందీ సినిమాలో నటించాడు. ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు సచిన్ జోషి.

ఇవి కూడా చదవండి

అఖిల్ అక్కినేనితో సచిన్ జోషి..

వివాదాలతోనూ…

కాగా సినిమాలకు దూరంగా ఉన్న సచిన్ జోషి రెండేళ్ల క్రితం వరుస వివాదాలతో వార్తల్లో నిలిచాడు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు. ఇక 2012లో, జోషి మోడల్, నటి ఊర్వశి శర్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఫ్యామిలీతో సచిన్ జోషి..

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి