Prabhas: వారెవ్వా.. పోస్టర్ అదిరిందిగా.. కన్నప్ప నుంచి ప్రభాస్ పోస్టర్ రిలీజ్..

భారీ అంచనాల మధ్య రూపొందుతున్న సినిమా కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, మోహన్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు పోస్టర్స్ విడుదలయ్యాయి. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సైతం రిలీజ్ అయ్యింది.

Prabhas: వారెవ్వా.. పోస్టర్ అదిరిందిగా.. కన్నప్ప నుంచి ప్రభాస్ పోస్టర్ రిలీజ్..
Prabhas, Kannappa
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 03, 2025 | 11:29 AM

మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా కన్నప్ప. ఈ మూవీలో వివిధ భాషలకు చెందిన అగ్ర సినీతారలు ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. ఇటీవల వీరిద్దరి పోస్టర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతో డార్లింగ్ ఏ పాత్రలో నటిస్తున్నారు.. అసలు ఆయన ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగా చెప్పినట్లుగా ఈరోజు (ఫిబ్రవరి 3న) ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో డార్లింగ్ రుద్ర పాత్రలో కనిపించనున్నట్లు క్లారిటీ ఇస్తూ ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన పోస్టర్ లో ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. మెడలో రుద్రాక్షలు, కాషాయ దుస్తులు, పెద్ద జుట్టుతో కనిపించారు. “ప్రళయ కాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు” అంటూ డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

భారీ బడ్జెట్ తో మోహన్ బాబు సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు కూతుర్లు, కొడుకు సైతం కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన