- Telugu News Photo Gallery Cinema photos Guess This Actress in This Photo, She In Thandel Movie Hero Naga Chaitanya Wife Heorine Sobhita Dhulipala
Tollywood: చారడేసి కళ్ల చిన్నారి.. ఇప్పుడు ఆ స్టార్ హీరోకు సతీమణి.. పాన్ ఇండియా హీరోయిన్..
సోషల్ మీడియాలో నిత్యం సెలబ్రెటీలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. ఇక తమ అభిమాన తారల చిన్ననాటి ఫోటోస్ చూసేందుకు.. వారి పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే మీకోసం ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటోస్ తీసుకొచ్చాం.
Updated on: Feb 03, 2025 | 7:57 AM

చారడేసి కళ్లు.. రెండు జడలతో కనిపిస్తున్న ఆ చిన్నారిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు ఆమె పాన్ ఇండియా హీరోయిన్. కేవలం దక్షిణాదిలోనే కాదు.. హిందీలోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది. అలాగే అటు వరుస వెబ్ సిరీస్ చేస్తూ సినీరంగంలో దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. అక్కినేని నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాళ్ల. మోడల్ గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. పాన్ ఇండియాల్లో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది.

2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొని ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె మిస్ ఎర్త్ 2023 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0తో మూవీతో హిందీ చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు , తమిళం, హిందీ భాషలలో వరుస చిత్రాల్లో నటించింది.

గతేడాది డిసెంబర్ 4న అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ప్రస్తుతం చైతూ తండేల్ మూవీలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 7న ఈసినిమా విడుదల కానుంది.





























